ETV Bharat / bharat

ఆదివాసీ విద్యార్థులకు 'ఆచార్య'లుగా మారిన ఐటీబీపీ జవాన్లు

author img

By

Published : May 7, 2022, 7:09 PM IST

మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు ఐటీబీపీ జవాన్లు. వారు ఏకలవ్య, నవోదయ వంటి పాఠశాలల్లో అడ్మిషన్ పొందేందుకు కోచింగ్ ఇస్తున్నారు. క్లాసులు చెప్పడమే గాక మెటీరియల్ కూడా పంపిణీ చేస్తున్నారు.

itbp-personnel-coach-students
ఆదివాసీ విద్యుర్థులకు 'ఆచార్య'లుగా మారిన ఐటీబీపీ జవాన్లు

ఆదివాసీ విద్యార్థులకు 'ఆచార్య'లుగా మారిన ఐటీబీపీ జవాన్లు

ITBP Jawans Coaching: సరిహద్దులో రేయింబవళ్లు గస్తీ కాస్తూ దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తారు ఇండో టిబెటన్​ సరిహద్దు పోలీసులు(ఐటీబీపీ). ఇప్పుడు వారే మారుమూల గ్రామాల్లోని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఆదివాసీ పిల్లలు పోటీ పరీక్షల్లో విజయవంతమయ్యేందుకు కోచింగ్ ఇస్తున్నారు. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండే ఛత్తీస్​గఢ్​లోని కొండగావ్ జిల్లాలో పేద పిల్లల విద్యకు తమవంతు సాయంగా ఈ శిక్షణ ఇస్తున్నారు 29వ బెటాలియన్​ ఐటీబీపీ జవాన్లు. నవోదవ, ఏకలవ్య పాఠశాలల్లో అడ్మిషన్లకు అర్హత సాధించేందుకు దాదాపు 200 మంది పిల్లలకు క్లాసులు చెబుతున్నారు. ముంజ్​మెటా, ఫార్సగావ్, ఝారా, ధౌదై వంటి సుదూర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఐటీబీపీ జవాన్లు చెప్పే తరగతులకు హాజరవుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోచింగ్​కు పంపుతున్నారు.

itbp-personnel-coach-students
ఆదివాసీ విద్యుర్థులకు 'ఆచార్య'లుగా మారిన ఐటీబీపీ జవాన్లు
itbp-personnel-coach-students
ఆదివాసీ విద్యుర్థులకు 'ఆచార్య'లుగా మారిన ఐటీబీపీ జవాన్లు

ITBP Chhattisgarh: పిల్లలకు క్లాసులు చెప్పడమే కాకుండా వారికి అవసరమైన మెటీరియల్​ను కూడా ఐటీబీపీ సిబ్బంది అందిస్తోంది. తమ వల్ల పేద విద్యార్థులు మంచి పాఠశాలల్లో అడ్మిషన్ పొందితే సంతోషిస్తామని చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్​గఢ్​లో వావపక్ష అతివాదంపై పోరాడేందుకు 2009లో ఐటీబీపీ సిబ్బందిని మోహరించింది ప్రభుత్వం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పౌరుల కోసం ఐటీబీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు హాకీ, ఆర్చరీ, జూడో, అథ్లెటిక్స్​లో శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు పాఠాలు కూడా బోధిస్తోంది.

itbp-personnel-coach-students
ఆదివాసీ విద్యుర్థులకు 'ఆచార్య'లుగా మారిన ఐటీబీపీ జవాన్లు

ఇదీ చదవండి: సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.