కనెక్షన్ లేకున్నా వేలల్లో కరెంట్ బిల్.. అధికారులపై గ్రామస్థులు ఫైర్

author img

By

Published : Nov 23, 2022, 11:25 AM IST

electricity metres

కరెంట్ కనెక్షన్ లేకుండానే తమకు వేలల్లో బిల్లులు వస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

విద్యుత్ సరఫరా లేకుండానే అధిక బిల్లులను ఇస్తున్నారని 12గ్రామాల ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖోక్సా, అల్లావుద్దీన్‌పుర్, దుద్లీ, డేరా భగీరథ్, నయా బాన్స్, మస్త్‌ఘర్, జాతన్, అహ్మద్‌గఢ్, ఖేడీ తదితర గ్రామాల్లో నివసిస్తున్న బవారియా వర్గం ప్రజలు.. ఉచిత విద్యుత్ పేరుతో తమ ఇళ్లలో అధికారులు మీటర్లు బిగించారని తెలిపారు. అయితే విద్యుత్ సరఫరా లేకుండా వేలలో కరెంటు బిల్లులను ఇస్తున్నారని వాపోయారు.

.
కనెక్షన్ లేని విద్యుత్ మీటర్

మూడేళ్ల క్రితం మీటర్లు బిగించే సమయంలో ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి తమ ఉమ్మడి కుటుంబంలో విద్యుత్ మీటర్లు బిగించారని తెలిపారు. అయితే ఇటీవల విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఇంటికి పలుమార్లు వచ్చి ఒక్కో మీటరుకు రూ.50 వేలు డిపాజిట్ చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. ఖోక్సా గ్రామ పెద్ద భగత్ రామ్ కూడా తమ పాడుబడిన ఇంట్లో అమర్చిన మీటర్‌కు విద్యుత్ డిపార్ట్‌మెంట్ రూ.50వేల విలువైన విద్యుత్ బిల్లులను జారీ చేసిందని అన్నారు.

.
కనెక్షన్ లేని విద్యుత్ మీటర్

అల్లావుద్దీన్‌పుర్‌ గ్రామానికి చెందిన సుందరవతీదేవి అనే మహిళ సైతం విద్యుత్ బిల్లులపై ఆవేదన వ్యక్తం చేశారు. "10 సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖ అధికారులు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చి మా ఇంటికి మీటర్ బిగించారు. అయితే ఇంకా విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. కానీ నాకు రూ.40వేల బిల్లు వచ్చింది. మేము ఎందుకు చెల్లించాలి?" అని ఆమె ప్రశ్నించారు.

ఈ విషయమై విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ అధికారి (ఎస్‌డీఓ) రవికుమార్‌ను సంప్రదించగా.. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే దీనిపై విచారణకు బృందాన్ని పంపి గ్రామస్థుల సమస్యలను పరిష్కరిస్తామని పశ్చిమాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రామ్ కుమార్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.