రూ.250 కోట్ల డ్రగ్స్ తరలిస్తున్న పడవ సీజ్

author img

By

Published : Sep 19, 2021, 6:14 PM IST

Iranian boat with heroin worth rs250 crore

భారీ స్థాయిలో డ్రగ్స్ తరలిస్తున్న ఇరాన్​ పడవ (Boat carrying drugs in India) పోలీసులకు చిక్కింది. భారత జలాల్లోకి ప్రవేశించిన పడవను గుజరాత్ ఏటీఎస్(Gujarat ATS), ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది పట్టుకున్నారు. ఏడుగురు ఇరానీలను అరెస్టు చేశారు.

భారీ మొత్తంలో హెరాయిన్​ను తరలిస్తున్న ఇరాన్​కు చెందిన ఓ పడవను (Boat carrying drugs in India) గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat ATS), కోస్ట్ గార్డ్ సిబ్బంది (Indian Coast Guard) పట్టుకున్నారు. భారత జలాల్లోకి ప్రవేశించిన ఈ పడవను.. గుజరాత్ తీరంలో అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉన్న ఏడుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. వీరంతా ఇరాన్ దేశస్థులేనని అధికారులు తెలిపారు.

పడవలో 30 నుంచి 50 కేజీల మాదకద్రవ్యాలు (Drugs seized in India) ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్​లో వీటి విలువ రూ.150 నుంచి రూ.250 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. అయితే, పడవను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే అందులో ఎంతవరకు డ్రగ్స్ ఉన్నాయో చెప్పగలమని అన్నారు.

Iranian boat with heroin worth rs250 crore, 7 crew members apprehended off Gujarat coast
అధికారులు సీజ్ చేసిన పడవ

ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు ముందుగానే సమాచారం అందించాయని గుజరాత్​ డిఫెన్స్ పీఆర్​ఓ వెల్లడించింది. దీంతో తక్షణమే అప్రమత్తమై ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు తెలిపారు. పడవను దగ్గర్లోని పోర్టుకు తరలించినట్లు గుజరాత్​ డిఫెన్స్ పీఆర్ఓ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలకు 3.92 లక్షల మంది బలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.