ETV Bharat / bharat

'మమతకు గాయం కుట్రే- విచారణ తప్పనిసరి'

author img

By

Published : Mar 12, 2021, 2:39 PM IST

Injuries to West Bengal CM Mamata Banerjee in Nandigram not "unfortunate incident" but conspiracy, TMC delegation tells EC in Delhi.
మమతకు గాయం.. ఈసీ వద్దకు టీఎంసీ ఎంపీలు

నందిగ్రామ్​లో మమత కాలికి గాయమైన ఘటన గురించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీల బృందం కలిసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటన.. అనుకోకుండా జరగలేదని, కుట్రపూరితంగానే జరిగిందని తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు(టీఎంసీ) ఆరోపించారు. ఈ మేరకు టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీల బృందం.. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్​ చేసింది.

"నందిగ్రామ్​లో మమతపై దాడి ఘటనలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మేము డిమాండ్​ చేశాం. ఆమెపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎవరూ లేరు. ఆ ఘటనలు ఆమెను హత్య చేసేందుకు జరిగినట్లుగానే తెలుస్తోంది. కుట్రపూరితంగా దీదీపై దాడికి పాల్పడ్డారు."

-టీఎంసీ నేత, సౌగతా రాయ్​.

నందిగ్రామ్​ ఎన్నికల ప్రచారంలో గాయపడ్డ బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎస్​ఎస్​కేఎమ్ ఆసుపత్రి​ వైద్యులు వెల్లడించారు. చికిత్సకు మమత స్పందిస్తున్నారని, వేగంగా కోలుకుంటున్నారని శుక్రవారం చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.