ETV Bharat / bharat

2 నెలల్లో 125 అతి భారీవర్షాలు- ఐదేళ్లలో అత్యధికం

author img

By

Published : Nov 3, 2021, 6:57 AM IST

India saw 125 extremely heavy rainfall events this Sept, Oct, highest in 5 years: IMD
2 నెలల్లో 125 అతి భారీవర్షాలు- ఐదేళ్లలో ఇవే అధికం

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యమవడం, అల్పపీడనాలు అధికంగా ఏర్పడటం వంటి పలు కారణాలతో దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 125 అతి భారీ వర్షాలు (Rainfall in India) కురిశాయని ఐఎండీ వెల్లడించింది. గత ఐదేళ్లలో ఇవే అత్యధికమని తెలిపింది. మరోవైపు, ఈ నెల 11 వరకూ వానలు (Rainfall forecast IMD) పడతాయని చెప్పింది.

దేశంలో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు, మధ్య 125 అతి భారీ వర్షాలు (Rainfall in India) కురిశాయని, గత ఐదేళ్లలో ఇవే అత్యధికమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యమవడం, అల్పపీడనాలు అధికంగా ఏర్పడటం, పశ్చిమ ప్రాంతం నుంచి అల్పపీడనాలతో కూడిన అవాంతరాలు చోటుచేసుకోవడమే (IMD rainfall data) కారణమని విశ్లేషించింది.

India saw 125 extremely heavy rainfall events this Sept, Oct, highest in 5 years: IMD
గత ఐదేళ్లలో కురిసిన అతి భారీ వర్షాలు
  • ఉత్తరాఖండ్‌లో గతనెల 18, 19 తేదీల్లో అనూహ్యంగా కురిసిన అతి భారీ వర్షాల కారణంగా 79మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరులో ఇక్కడ సాధారణంగా 35.3 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అందుకు భిన్నంగా ఈసారి 203.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
  • సాధారణంగా అక్టోబరు 15న రుతుపవనాల ఉపసంహరణ చోటుచేసుకుంటుంది. ఈసారి 25వ తేదీవరకూ అవి కొనసాగాయి.
  • దేశంలో జూన్‌-సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. 1961-2010 సంవత్సరాల దీర్ఘకాల సగటు 88 సెంటీ మీటర్లు కాగా, ఈ ఏడాది 87 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
  • దేశంలో వరుసగా మూడో ఏడాది కూడా సాధారణ, అంతకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిశాయి.

దక్షిణాదిలో నవంబరులోనూ వర్దాలు

నవంబరు నెలలో కోస్తాంధ్ర, రాయలసీమ(Rainfall in AP), తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 11 వరకూ వానలు పడే (Rainfall forecast IMD) అవకాశముందని; దీర్షకాల సగటుతో పోలిస్తే ఈ వర్షపాతం 122% అధికంగా ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వరుణుడి ప్రకోపం.. కన్నీటి సంద్రమైన కేరళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.