ETV Bharat / bharat

Corona Cases India: దేశంలో మరో 45 వేల కేసులు.. 366 మరణాలు

author img

By

Published : Sep 3, 2021, 9:32 AM IST

Corona Cases India
భారత్​లో కరోనా కేసులు

దేశంలో కరోనా(Corona Update) కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 45,352 మందికి వైరస్​(Covid-19) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 366 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona Update) కాస్త తగ్గింది. కొత్తగా 45,352 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 366 మంది మరణించారు. ఒక్కరోజే 34,791 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,29,03,289‬
  • మొత్తం మరణాలు: 4,39,895
  • మొత్తం కోలుకున్నవారు: 3,20,63,616
  • యాక్టివ్ కేసులు: 3,99,778

వ్యాక్సినేషన్

గురువారం ఒక్కరోజే 74,84,333 కొవిడ్​ టీకా (Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 67,09,59,968 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ పరీక్షలు

దేశవ్యాప్తంగా గురువారం 16,66,334 కొవిడ్​ పరీక్షలు(Covid Tests) చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,78,902 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 10,653 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,99,21,886కు చేరగా.. మరణాల సంఖ్య 45,55,822కు పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  • అమెరికా - 1,77,568
  • బ్రెజిల్​- 26,497
  • రష్యా- 18,985
  • బ్రిటన్​- 35,693
  • ఫ్రాన్స్​- 15,911

ఇదీ చూడండి: విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్​లో ఐఐఎస్​సీ సత్తా- దేశంలో టాప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.