దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 2.68లక్షల కరోనా కేసులు

author img

By

Published : Jan 15, 2022, 9:54 AM IST

corona cases news

Covid cases in India: భారత్​లో కొత్త కరోనా కేసులు అమాంతం పెరిగాయి. మరో 2,68,833 మందికి వైరస్​ సోకింది. వైరస్​తో 402 మంది మరణించారు. 1,22,684 మంది కొవిడ్​ను జయించారు.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం మరణాలు: 48,57,52
  • యాక్టివ్ కేసులు: 14,17,820
  • మొత్తం కోలుకున్నవారు: 34,94,7,390

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 58,02,976 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,02,51,117కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,71,780 మందికి కరోనా సోకింది. 7,629 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,42,68,862కి చేరగా.. మరణాలు 55,46,837కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,05,620 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,140 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.6 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 3,29,371 కేసులు వెలుగుచూశాయి. మరో 191 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 99,652 మంది వైరస్ బారిన పడ్డారు.​ 270 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 1,86,253 కొత్త కేసులు బయటపడగా.. 360 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,62,508 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 139 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?

దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి.. మరో 2.64 లక్షల మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.