ETV Bharat / bharat

మిరుమిట్లు గొలిపే వెలుగులతో 2022కు భారతావని స్వాగతం

author img

By

Published : Jan 1, 2022, 12:00 AM IST

india new year celebrations
దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు

మహమ్మారి ధాటికి సతమతమైన భారత్​ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఆహ్లాదాన్ని కలిగించే రంగురంగుల దీపాలు, కళ్లు చెదిరే లేజర్​ షోల మధ్య నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు ప్రజలు. గుజరాత్​లో నృత్యాలు చేస్తూ జవాన్లు వేడుకలు జరుపుకున్నారు.

రంగురంగుల కాంతులతో చూపరులను ఆకట్టుకునే విద్యుత్​ దీపాల వెలుగులు, కళ్లు చెదిరే లేజర్​ షోల మధ్య దేశవ్యాప్తంగా ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. భవనాలు, చారిత్రక కట్టడాలు విద్యుత్​ దీపాల కాంతులతో వెలిగిపోతున్నాయి.

india new year celebrations
పార్లమెంటు వద్ద విద్యుద్దీప కాంతులు
india new year celebrations
వెలుగుజిలుగుల్లో పార్లమెంటు భవనం
india new year celebrations
పార్లమెంటు వద్ద లైట్లు

పార్లమెంటు భవనం నార్త్ బ్లాక్​, సౌత్​బ్లాక్​ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ చూపరులను ఆకట్టుకుంటోంది.

ముంబయిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద అమర్చిన రంగురంగుల లైట్లు... ముంబయి వాసుల మదిని దోచుకుంటున్నాయి.

india new year celebrations
ముంబయిలోని ఛత్రపతి టెర్మినస్ వద్ద లైట్లు
india new year celebrations
ముంబయిలో ఛత్రపతి టెర్మినస్ వద్ద లైట్లు
india new year celebrations
అందమైన కాంతులతో ప్రకాశిస్తున్న ముంబయిలోని ఛత్రపతి టెర్మినస్

ముంబయిలోని బంద్రా-వర్లీ సీలింక్ వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఏర్పాట్లు చేశారు.

గుజరాత్​ కచ్​లో బీఎస్​ఎఫ్ జవాన్లు నూతన సంవత్సర వేడకలు జరుపుకున్నారు. నృత్యాలు చేస్తూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకున్నారు.

india new year celebrations
నృత్యాలు చేస్తున్న బీఎస్​ఎఫ్ సైనికులు
india new year celebrations
దేవుళ్లకు పూజ చేస్తున్న బీఎస్​ఎఫ్​ సైనికుడు
india new year celebrations
బీఎస్​ఎఫ్ జవాన్ల సంబరాలు

కొవిడ్​ నేపథ్యంలో ఆంక్షల మధ్యే దిల్లీ వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

ఇదీ చూడండి: కన్నుల పండువగా ఆస్ట్రేలియాలో నూతన సంవత్సర వేడుకలు

ఇదీ చూడండి: 2022కి న్యూజిలాండ్ స్వాగతం- బాణసంచా కాల్చి సంబరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.