ETV Bharat / bharat

దేశంలో కరోనా తగ్గుముఖం.. 20 వేల దిగువకు కొత్త కేసులు

author img

By

Published : Feb 20, 2022, 9:32 AM IST

INDIA COVID CASES
INDIA COVID CASES

India covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 19,968‬ కేసులు నమోదయ్యాయి. 48,847 మంది కోలుకున్నారు. 673 మంది మరణించారు.

India covid cases: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 19,968‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 673 మంది మరణించారు. 48,847 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 4,28,22,473‬
  • మొత్తం మరణాలు: 5,11,903
  • యాక్టివ్ కేసులు: 2,24,187
  • మొత్తం కోలుకున్నవారు: 4,20,86,383

Vaccination in India:

దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 30,81,336 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,37,22,697కు చేరింది.

World Covid cases:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 15,90,061 కేసులు బయటపడ్డాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • రష్యాలో తాజాగా లక్షా 79 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 798 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 51 లక్షలు దాటింది.
  • జర్మనీలో 1.37 లక్షల కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 133 మంది కరోనాకు బలయ్యారు.
  • బ్రెజిల్​లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 827 మంది చనిపోయారు. కొత్తగా లక్షా మూడు వేల కేసులు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియాలోనూ లక్షకు పైగా కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. 71 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్, టర్కీ, ఫ్రాన్స్, ఇండోనేసియా దేశాల్లోనూ వైరస్ విజృంభణ తీవ్రంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: కొవిడ్​పై అలా వ్యవహరించడం మంచిది కాదు: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.