India China Border News: 'చైనా కాలు దువ్వితే చూస్తూ ఊరుకోం..'

author img

By

Published : Oct 19, 2021, 1:05 PM IST

manoj pande

రెండేళ్లలో సరిహద్దు రేఖ (India China Border News) వద్ద చైనా గస్తీని మరింత కట్టుదిట్టం చేసిందని ఈస్ట్రన్​ కమాండర్​ మనోజ్​పాండే అన్నారు. సున్నిత ప్రాంతాల్లో నిర్మాణాలను చేపడుతుందని చెప్పారు. వాటిపై ఇప్పటికే భారత్​ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

చైనా కయ్యానికి కాలు దువ్వితే భారత సైన్యం చూస్తూ కూర్చోదని.. ఇందుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సన్నాధంగా ఉందని ఈస్ట్రన్ ఆర్మీ కమాండ్ స్పష్టం చేసింది. భారత్ ఎప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ.. చైనాతో శాంతి, సామరస్య పూర్వక వాతావరణం కొనసాగించేందుకే ప్రయత్నిస్తుందని పేర్కొంది. గత కొంత కాలంగా సరిహద్దుల్లో (India China Border News) రెండు దేశాల సైనిక కదలికలు పెరిగాయని ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ మనోజ్ పాండే తెలిపారు. అన్ని రకాల వాతావరణంలో పని చేసే.. ఆల్ టెరైన్ వాహనాలు, గైడెడ్ ఆయుధాలు, బెటర్ రాడార్లు, నైట్​విజన్ కెమెరాలను సిద్ధం చేసినట్లు పాండే పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద బలగాల మోహరింపు (India China Border Dispute) ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాలు వాస్తవాధీన రేఖ సమీపం వరకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయన్నారు. వాస్తవాధీన రేఖ వెంట బలగాల మోహరింపు కంటే.. నిఘా పెంపుదలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిపారు.

ఈస్ట్రన్ కమాండ్ ప్రాంతంలో డిఫెన్స్ టెక్నాలజీ అన్ని విషయాల్లో అమల్లో ఉందని, నిఘా కోసం రాడార్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు, సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మనోజ్​ పాండే చెప్పారు. వాస్తవాధీన రేఖకు సమీపంలోని సున్నిత ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణల విషయంలో (India China Border Dispute) ఎప్పటికప్పుడు మనం అభ్యంతరాలు వ్యక్త పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, రూపొందించిన నియమావాళికి అనుగుణంగానే భారత్ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బలగాల (India China Border Dispute) తరలింపులో ఒక ప్రత్యేక వ్యూహం అనుసరిస్తున్నట్లు పేర్కొన్న ఆర్మీ కమాండర్​.. మరికొన్ని రోజుల్లో శీతాకాలం మొదలవనుందని అన్నారు. పహారాలో ఉండే సిబ్బందికి మూడు నాలుగు నెలలకు సరిపడేలా అన్ని సమకూర్చినట్లు తెలిపారు. ఆధునిక యుద్ధ రంగంలో కీలకమైన ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్​ని ఆర్మీలో ప్రవేశపెట్టే విషయంలో సూచన ప్రాయంగానే ఆమోదం లభించిందన్న ఆర్మీ కమాండర్.. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ఇంకా ఖరారు కాలేదన్నారు. చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన మౌంటెన్ స్ట్రైక్ కోర్.. పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

చినూక్ హెలికాప్టర్లు సైన్యంలోకి వచ్చిన తరువాత.. ఈస్ట్రన్ కమాండ్​లో బలగాలు, ఆయుధాలు తరలింపు సులభతరం, వేగవంతం అయ్యిందన్నారు. అల్ట్రా లైట్ హావిట్జర్స్​ను కీలక ప్రాంతాల్లో మోహరించినట్లు చెప్పిన మనోజ్​ పాండే అత్యవసర సమయంలో తరలించే సామర్థ్యం చినూక్ హెలికాప్టర్స్​కు ఉందన్నారు.

ఇదీ చూడండి: మెరుపు వేగంతో సరిహద్దుకు బలగాలు- భారత్​ వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.