ETV Bharat / bharat

Hyderabad Hotel Staff Beat Customer to Death : బిర్యానీలో ఎక్స్​ట్రా రైతా అడిగిన కస్టమర్​పై హోటల్ సిబ్బంది దాడి.. యువకుడు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 12:15 PM IST

Hyderabad Hotel Staff Beat Customer to Death : పార్టీ ఏదైనా, గెస్ట్​లు ఎవరైనా.. బిర్యానీ మస్ట్! వంట చేయడానికి బద్ధకంగా అనిపించినప్పుడు ఆన్​లైన్​లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు.. మొదటగా గుర్తొచ్చేది బిర్యానీనే. అంతలా భారతీయుల జీవనశైలిలో భాగమైపోయింది బిర్యానీ. అందుకే ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ రంగంలోనూ బిర్యానీయే కింగ్. అలా హైదరాబాద్ ఫుడ్​ ప్రియులు ఎక్కువగా బిర్యానీని ఇష్టపడుతుంటారు. అలా బిర్యానీ అంటే ఇష్టమున్న ఓ వ్యక్తి హోటల్​కు వెళ్లాడు. బిర్యానీని హాయిగా ఆరగించి.. చివరలో రైతాతో తినాలనుకున్నాడు. అందుకు హోటల్ ఇచ్చిన రైతా సరిపోక.. ఎక్స్​ట్రా రైతా అడిగాడు సిబ్బందిని. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఆ బిర్యానీ లవర్ ప్రాణాలు పోయిన ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది.

Customer Killed By Hyderabad Restaurant Staff
Hyderabad Hotel Staff Beat Customer to Death

Hyderabad Hotel Staff Beat Customer to Death బిర్యానీలో ఎక్స్​ట్రా రైతా అడిగిన కస్టమర్​పై హోటల్ సిబ్బంది దాడి.. యువకుడు మృతి

Hyderabad Hotel Staff Beat Customer to Death : హైదరాబాద్ అనగానే ఫుడ్ లవర్స్ అందరికీ దమ్ బిర్యానీ(Hyderabad Dum Biryani) గుర్తొస్తుంది. ఇక హైదరాబాదీల వీకెండ్​ మెనూ కార్డ్​లో ముక్క ఉండి తీరాల్సిందే. ఆ పీస్ బిర్యానీలోదైతే అద్భుతం అంటారు. అందుకే భాగ్యనగరం వ్యాప్తంగా ప్రతీ గల్లీలోనూ బిర్యానీ హోటళ్లు మనకు దర్శమిస్తుంటాయి. ఇలా హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అయింది. ఇక సండే వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ సండే రోజు కొంతమందికి వంట చేసుకోవడం ఇష్టముండదు. అలాగని ఆన్​లైన్​లోనూ ఆర్డర్ చేయరు. జాలీగా రెస్టారెంట్​కు వెళ్లి అక్కడే బిర్యానీని ఆరగించేస్తుంటారు కొందరు. అలా ఓ బిర్యానీ లవర్ ఓ హోటల్​కు వెళ్లాడు. తన ఫేవరెట్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. టేస్టీ టేస్టీ బిర్యానీని హాయిగా ఆరగించాడు. చివరలో రైతా సరిపోక ఎక్స్​ట్రా రైతా ఇవ్వమని సిబ్బందిని అడిగాడు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గొడవ.. ఆ బిర్యానీ లవర్ ప్రాణాలు బలితీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

Customer Killed By Hyderabad Restaurant Staff : హైదరాబాద్​ పంజాగుట్టలో ఓ హోటల్‌కు వచ్చిన వినియోగదారుడికి.. హోటల్‌ సిబ్బందికి మధ్య జరిగిన గొడవలో వినియోగదారుడు మృతి చెందాడు. పంజాగుట్ట ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన లియాకత్‌.. ఆదివారం రాత్రి ఓ హోటల్‌కు బిర్యానీ తినడానికి వచ్చాడు. అయితే అతను తనకు ఎక్స్​ట్రా పెరుగు కావాలని సిబ్బందిని అడిగాడు.

ఎక్స్​ట్రా పెరుగు ఇవ్వడం కుదరదని సిబ్బంది లియాకత్​తో చెప్పాడు. ఈ క్రమంలో సిబ్బందికి, అతనికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణకు దారి తీసి సిబ్బంది వినియోగదారుడు లియాకత్​పై దాడికి దిగాడు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు హోటల్‌కు చేరుకుని ఇరు వర్గాలను పోలీస్‌స్టేషన్‌ తీసుకువచ్చి మాట్లాడుతుండగానే.. కొద్దిసేపటికే లియాకత్‌ ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌లో కుప్ప కూలిపోయాడు. పోలీసులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లియాకత్ మృతి చెందాడు.

Hyderabad Restaurant Staff Beat Customer to Death : దాడి జరిగిన తర్వాత బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో.. చికిత్స అందడంలో జాప్యం జరిగి లియాకత్‌ మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్‌ బేగ్‌(MIM MLC Mirza Rahmat Baig) పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని మృతి చెందిన లియాకత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన హోటల్‌ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2వేల మందికి MP మటన్​ రైస్​ విందు.. ఒక్కసారిగా తొక్కిసలాట.. డీఎస్పీకి గాయాలు

బిర్యానీ అంటే ప్రాణం! ఏడాదిలో ఎన్ని కోట్లు ఆర్డర్ చేశారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.