ETV Bharat / bharat

రోజుకు ఆరు సార్లు స్నానం చేస్తోందని భార్యకు విడాకులు!

author img

By

Published : Dec 4, 2021, 3:34 PM IST

bathing 6 times a day
రోజుకు ఆరుసార్లు స్నానం చేస్తోందని భార్యకు విడాకులు!

రోజుకు ఆరుసార్లు స్నానం చేస్తూ.. ఇంట్లో అతిశుభ్రత పాటిస్తున్న భార్య ప్రవర్తనకు విసుగు చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తనకు ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోరాడు. పోలీసులు ఈ కేసును ఉమన్​ హెల్ప్​లైన్​ సెంటర్​కు బదిలీ చేశారు.

భార్య రోజూ స్నానం చేయని కారణంగా తనకు విడాకులు ఇప్పించాలంటూ భర్త కోర్టు మెట్లు ఎక్కిన ఘటన జరిగిన కొన్ని రోజులకే మరో వ్యవహారం వెలుగుచూసింది. భార్యపై ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి.. తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. అయితే ఈ ఘటనలో వీరి దాంపత్యం విడాకుల దాకా వెళ్లడానికి కారణం అతిశుభ్రత.

రోజుకు ఆరుసార్లు స్నానం..

ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన ప్రకారం... బెంగళూరులోని ఆర్​టీ నగర్​లో నివసిస్తున్న ఈ దంపతులకు 2009లో వివాహమైంది. బెంగళూరు రాకముందు కొంతకాలం లండన్​లో ఉండేవారు. అప్పటి నుంచే భార్యకు శుభ్రతపైన శ్రద్ధ ఎక్కువ ఉండేది. మొదటి కాన్పు తర్వాత అది మరింత ఎక్కువైంది. భర్తను బూట్లు, బట్టలు, ఫోన్లూ తరచూ శుభ్రం చేయమనేది.

ఆ తర్వాత కొంతకాలానికి భారత్​కు తిరిగివచ్చినా ఆమె వైఖరిలో మార్పులేదు. దీంతో విసుగు చెందిన భర్త డాక్టర్​ వద్దకు తీసుకెళ్లగా ఆమె ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్​)తో బాధపడుతున్నట్లు తేలింది. కౌన్సెలింగ్​కు తర్వాత కాస్త మార్పు కనిపించింది. కానీ రెండోసారి బిడ్డకు జన్మనిచ్చాక ఈ పరిశుభ్రతపై మరోసారి శ్రద్ధ ఎక్కువైంది. అది కాస్తా గతేడాది లాక్​డౌన్​తో తారస్థాయికి చేరింది. భర్త వర్క్​ఫ్రమ్​ హోమ్​ చేస్తున్న సమయంలో అతని ల్యాప్​టాప్​, ఫోన్లను డిటర్జెంట్లతో శుభ్రం చేసేది. తరచూ స్పూన్లు, మ్యాట్లు సహా ఫర్నిచర్​ను శానిటైజ్​ చేసేది. ఈ అతిశుభ్రత ఏ స్థాయికి వెళ్లిందంటే.. అందరూ స్నానాలు ముగించుకున్నాక వారు వాడిన సబ్బును కూడా శుభ్రం చేయడం సహా రోజుకు ఆరుసార్లు స్నానం చేసేది.

భార్య ప్రవర్తనకు విసుగు చెందిన భర్త విడాకులు ఇచ్చేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు ఆర్​టీ నగర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును ఉమన్​ హెల్ప్​లైన్​ సెంటర్​కు బదిలీ చేశారు.

ఇదీ చూడండి : భార్యతో గొడవ.. కోపంలో ఏడేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.