ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే?

author img

By

Published : Mar 8, 2023, 6:08 AM IST

Horoscope Today : ఈ రోజు(మార్చి 8) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today
ఈ రోజు రాశి ఫలాలు

Horoscope Today : ఈ రోజు(మార్చి 8) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మీ శారీరక, మానసిక స్థితి ఈ రోజు బాగుంటుంది. మీరు ఒక ఊహాత్మక ప్రపంచంలో ఉంటారు. మీ సృజనాత్మకత వల్ల మంచి పేరు పొందుతారు. గ్రహ ప్రభావం వల్ల ఈ రోజు సాహిత్యం, కళలు, విద్యా రంగాల్లో రాణిస్తారు.

.

మీరు ఈ రోజు మాటతీరు, కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఈ రోజు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్రిక్తతలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త పడడం మేలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ పట్ల చికాకుగా ఉండే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా ఉంటే మంచిది.

.

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా. మీ ప్రయత్నాల్లో మీరు విజేతలవుతారు. మీ ప్రత్యర్థులు అపజయం చవిచూస్తారు. మధ్యాహ్నం వరకు మీ గ్రహబలం అనుకూల రీతిలోనే నడుస్తుంది. మధ్యాహ్నం తర్వాత అనుకోని రీతిగా తలకిందులవుతుంది. మీ అమ్మగారి ఆరోగ్యం మిమ్మల్ని కలచివేస్తుంది.

.

ఈ రోజు మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. మీ మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. సాయంత్రం ఒక కాలక్షేప పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ సహోద్యోగులలో సన్నిహితంగా ఉంటారు.

.

ఈ రాశి వారు ఈ రోజు చాలా ఆత్మ విశ్వాసంతో ఉంటారు. మీ ఆత్మ గౌరవం ఈ రోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు మంచి పేరును సంపాదిస్తాయి. మీరు ఏ సమస్యలైనా క్షణాల మీద పరిష్కరించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం వల్ల మీకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పనులు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇంట్లో కొన్ని అవసరాలకు డబ్బు బాగానే ఖర్చు అవుతుంది.

.

మీరు ఈరోజు తీవ్రమైన భావోద్వేగంతో ఉంటారు. మీ బలహీనతలను బయటపెట్టకండి. వివాదాలకు దూరంగా ఉండండి. మీకు ఇష్టమైన వారికి ఏదైనా చెప్పడానికి ముందు ఆలోచించండి. ఆర్దికస్థితిని అదుపులో పెట్టుకోవడం ఉత్తమం.

.

ఈరోజు కొత్త పనులను ప్రారంభించడం అంత మంచిది కాదు. సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం వల్ల మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆ సమయంలో అధిక ఒత్తిడి మీ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది.

.

ఏ పని మీకు సాధ్యం కానిది అంటూ ఉండదు. మీరు నిశ్చయానికి, ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపంగా ఉంటారు. వేగంగా పని చేయడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీ పైఅధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. మీ ప్రయత్నాలను, అద్భుతమైన ఆలోచనలను ప్రశంసిస్తారు. పదోన్నతి, జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు. మీ తండ్రితో మాట్లాడడం గానీ, ఆయనని కలవడం కాని జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత మీకు మానసిక సందిగ్ధత ఉంటుంది. మీ స్నేహితులతో కాసేపు అలా బయట తిరిగి రండి.

.

మీరు ఈ రోజు చాలా సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు. మీ ధార్మిక చింతనలో వేగం కనిపిస్తోంది. మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. శిశు జననం లేదా ఇతరత్రా మంచి విషయం ఏమైనా మీ కుటుంబంలో జరగవచ్చు. మీకు ఇష్టమైన వారితో గడపండి. మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆనందంగా ఉంచుతుంది. సాయంత్రం కాస్త జాగ్రత్త వహించడం మేలు. కోపం తగ్గించుకోండి.

.

ఈ రోజు మీరు చికాకు, కోపం తగ్గించుకోండి. దిగులుగా ఉంటారు. మీ శక్తియుక్తులన్నీ చివరికు ప్రతికూల ఫలాలనే ఇస్తాయి. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. యోగా చేయండి. అది ప్రతికూల ఆలోచనలకు కళ్లెం వేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. అనుకోని ఖర్చులు ఉండవచ్చు. మధ్యాహ్నానికి తారాబలం మెరుగుపడుతుంది. ధార్మిక సంబంధమైన ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉన్న చింతలను పారదోలడానికి ఇదే మంచి మార్గం.

.

మీ వ్యాపార భాగస్వాములతో, కస్టమర్లతో ఆహ్లాదకరమైన రీతిలో వ్యవహరించండి. సహ కార్మికులతో అనవసర చర్చలు మానుకోండి. మీరు పని చేసే ప్రదేశంలో తీవ్రమైన కృషి చేసినా కూడా మీరు ఫలితాలతో సంతృప్తి చెందరు. ఇంట్లో మాత్రం ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటుంది.

.

ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. కానీ మీ భాగస్వామితో మీకు చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఈ గొడవల వల్ల రోజు మొత్తం దిగులుగా ఉంటారు. భార్య ఆరోగ్యం పట్ల కొందరు ఆందోళన చెందుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.