ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా?

author img

By

Published : Mar 3, 2023, 6:28 AM IST

Updated : Mar 3, 2023, 7:02 AM IST

Horoscope Today: ఈ రోజు(మార్చి 3) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today
రాశి ఫలాలు

Horoscope Today: ఈ రోజు(మార్చి 3) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మీరు మీ షెడ్యూల్​ను చక్కగా ప్లాన్ చేసుకుంటే ఈ రోజు చాలా సరదాగా ఉంటుంది. పని ఎప్పటిలాగే ఉంటుంది. సాయంత్రం ఓ సర్​ప్రైజ్​ ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తితో ఆనందంగా గడపండి. సంగీతంతో మధుర క్షణాలు గడపండి.

.

మీలో కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. మీ దృష్టంతా వాటికి సంబంధించిన వ్యవహారాలపైనే ఉంటుంది. కానీ మధ్యాహ్నం మీకు అంత ఆశాజనకంగా ఉండదు. కొన్ని అంచనాల కారణంగా మీరు దిగులుపడతారు. ఒత్తిడిని దూరం పెట్టి మీకు ఇష్టమైన వారితో కలిసి రాత్రి భోజనం చేయండి.

.

షార్ట్ టెంపర్, పోటీతత్వం మీలో ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు మీకు కొంచెం తికమకగా ఉంటుంది. ఎంతో నిరాశజనకంగా అనిపించినప్పటికీ ఆందోళన చెందకండి. క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇంకా మార్గాలు ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ రోజు మీరు మీ పని ప్రదేశంలో వించారు.

.

మీ ఖర్చులు ఆదాయాన్ని అధిగమించే అవకాశం ఉంది. తెలివిగా ఖర్చు చేయండి. కంటికి సంబంధించిన సమస్య అయితే.. మరింత నష్టం కలగడానికి ముందే, వీలైనంత త్వరలో కంటి వైద్యుడిని కలవండి. మీ కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోండి. లేదంటే మీరు కచ్చితంగా శత్రువులను ఆహ్వానిస్తారు.

.

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రోజు మొదటి సగ భాగం శుభవార్తలతో నిండి ఉంటుంది. అది వ్యక్తిగతంగా కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు. వార్తలు ప్రయోజనకరంగా ఉండటం వలన మీరు ఈరోజు ఆనందభరితులు అవుతారు. మంచి జరగాలని కోరుకోండి. ఆదాయం, ఇతర ఆర్ధిక వనరుల పెరుగుదలకు అవకాశం ఉంది.

.

మీ సృజనాత్మకత ఈ రోజు గట్టిగా కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఏళ్లుగా ఉన్న సహనం జ్ఞాపకాల రూపంలో కదలాడుతుంది. మీ ఇంటిని చక్కని ఫర్నీచర్, కళాకృతులతో తీర్చిదిద్దుకుంటారు.

.

ఆందోళనల సుడిగుండంలో చిక్కుకోని, మీరు ఎన్నడూ లేనంత దీనస్థితిలో ఉంటారు. మీ పిల్లలు విబేధాలను పెట్టుకునే అవకాశం ఉంది. అది మిమ్మల్ని ఈ రోజు బాధించవచ్చు. పని ప్రదేశం వద్ద పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మీ సీనియర్లు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని మీకు తెలుస్తుంది.

.

మీ కోసం మీరు పనిచేయడం ఈ రోజు చాలా ముఖ్యం. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చుల కోసం మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ మీ కుటుంబం, స్నేహితులతో ఈ రోజు ఆహ్లాదకరంగా ముగుస్తుంది.

.

మీ హృదయం ఏం కోరుకుంటుంది. మీ మనస్సు ఏం ఆశిస్తోందో గ్రహించి వాటి మధ్య సమతూకం పాటించడం ఈ రోజు మీకు చాలా ముఖ్యం. మీ పనిలోని నాణ్యత ద్వారా మీ దృక్పథాన్ని, మీ లక్ష్య శక్తిని ఇతరులు చూడగలుగుతారు. మీ అభిరుచికి ఉత్తేజం కల్పించే దాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్తారు.

.

మీ మాటల తియ్యదనం వల్ల మీరు ఈరోజు చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. ఇంటి దగ్గర పరిస్థితులు ప్రశాంతంగా, ఉల్లాసభరితంగా ఉంటాయి. గౌరవ ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంది. ఆర్ధిక లాభాల వల్ల మీ పర్సులు నిండిపోతాయి. మీ కొత్త కారులో బయటకు వెళ్లి సరదాగా గడపండి. ఒక సుదీర్ఘమైన కారు ప్రయాణం అంత చెడ్డ ఆలోచన కాదు. సాయంత్రాన్ని పూర్తిగా ఆనందించండి.

.

ఈ రోజు దృష్టంతా మీపైనే ఉంటుంది. శ్రద్ధ, ప్రశంసలు మీరు మరింత కష్టించి పనిచేసేలా దారితీస్తాయి. మీ పనితీరు మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కానీ మీ పనితో వారిని మీరు పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేరు. పేరు కారణంగా పొంగిపోకుండా స్థిరంగా ఉండండి.

.

ఈ రోజు ఉత్సాహం, శక్తి నిండిన రోజు. దూర ప్రాంతాల నుంచి మీరు శుభవార్త అందుకుంటారు. దాన్ని మీరు మీ ఇష్టులతో పంచుకోవాలనుకుంటారు. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విషయాన్ని మీరు పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు వ్యాపారపరంగా ప్రయాణ షెడ్యూల్ రూపొందించుకుంటారు.

Last Updated : Mar 3, 2023, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.