ETV Bharat / bharat

ఆ రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోండి- లేదంటే ఇబ్బందులే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 5:03 AM IST

Horoscope Today December 15th 2023
Horoscope Today December 15th 2023

Horoscope Today December 15th 2023 : డిసెంబర్​ 15న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today December 15th 2023 : డిసెంబర్​ 15న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈరోజు మీరు అనవసరమైన వాదనలు, అర్థంలేని చర్చల్లో పాల్గొవద్దు. లేదంటే ఈరోజు మీరు ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

.

వృషభం (Taurus) : ఈ రోజు మీరు అవిశ్రాంతంగా గడుపుతారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపాన్ని, మాటలను నియంత్రణలో పెట్టుకోండి. మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి కొత్త పనులను ఈ రోజు ప్రారంభించవద్దు.

.

మిథునం (Gemini) : ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉదయం బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి.

.

కర్కాటకం (Cancer) : ఆఫీసులో పనికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పనిలో మీతో పోటీపడేవారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి అది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మీ తల్లి తరఫు నుంచి వచ్చే శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని అహ్లాదభరితం చేస్తుంది. మీ శారీరక, మానసిక స్థితి ఈ రోజు బాగుంటుంది.

.

సింహం (Leo) : ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజు శారీరకంగా మీరు కొంత ఇబ్బందిగా ఉంటారు.

.

కన్య (Virgo) : ఈ రోజు మీరు బద్ధకంగా ఉంటారు. ఖర్చులు కూడా పెరుగుతాయి. వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. మీ ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవడం మిమ్మల్ని నిరాశపరుస్తుంది.

.

తుల (Libra) : ఇవాళ మీరు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. మీ బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడిపేందుకు ఇదే సరైన సమయం. మీ పేరుప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

.

వృశ్చికం (Scorpio) : ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. ఓపికతో ఉండండి. సాయంత్రానికి పరిస్థితులు మెరుగవుతాయి. ఇంటి దగ్గరవారితో గొడవలకు దిగవద్దు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి బాగా కలిసివస్తుంది. ఈ రాశివారు ఆర్థికంగా బలపడతారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అందుకే మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు సాయంత్రం మీరు దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంది. ఆఫీస్, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు చెయ్యకండి.

.

మకరం (Capricorn) : ఇవాళ మకరరాశివారికి బాగానే ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

.

కుంభం (Aquarius) : ఈరోజు మీరు ఆర్థికంగా బలపడతారు. ఇంటి వాతావరణం ప్రశాంతత నుంచి వివాదాలవైపు వెళ్తుంది జాగ్రత్త. ఈ అస్థిర వాతావరణం మీ కుటుంబంలోని సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

.

మీనం (Pisces) : ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. వృత్తిపరంగా రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు సరదాగా గడిచిపోతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.