ETV Bharat / bharat

Horoscope Today (28-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

author img

By

Published : Nov 28, 2021, 5:48 AM IST

ఈ రోజు రాశిఫలాలు (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశిఫలం
horoscope

ఈరోజు (28-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవనామ సంవత్సరం: దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం; బహుళపక్షం

నవమి: రా. 11.57 దశమి పుబ్బ: సా. 5.42

ఉత్తర వర్జ్యం: రా. 12.51 నుంచి 2.27 వరకు

అమృత ఘడియలు: ఉ.11.13 నుంచి 12.50 వరకు

దుర్ముహూర్తం: సా. 3.51 నుంచి 4.35 వరకు

రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.6.16, సూర్యాస్తమయం: సా.5-20

రాశిఫలాలు..

మేషం..

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన మంచినిస్తుంది.

వృషభం..

మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

మిథునం..

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం..

శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.

సింహం..

మంచి ఫలితాలున్నాయి. కీలక వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. హనుమత్ దర్శనం ఉత్తమం.

కన్య..

ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్ని విధాలా మంచిది.

తుల..

మీ మీ రంగాల్లో తోటివారి సాయం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శుభదాయకం.

వృశ్చికం..

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. బంధుజన సహకారం ఉంటుంది. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

ధనస్సు..

చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావలసిన అవకాశాలు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహం ఆవరిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపం కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.

మకరం..

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేయడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం మంచిది. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

కుంభం..

శుభకాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

మీనం..

చేపట్టే పనుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో కలహ సూచన ఉంది. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీగణపతి ఆరాధన శుభదాయకం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.