భార్యకు ప్రేమతో.. చంద్రుడిపై స్థలాన్ని కానుకగా ఇచ్చిన భర్త

author img

By

Published : Jun 25, 2022, 6:31 AM IST

man gifts land on moon to wife

Man gifts land on moon to wife: సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు కానుకగా ఆభరణాలు ఇస్తారు.. వస్తువులు ఇస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ స్థలం కొన్నది భూమిపై కాదండి చంద్రమండలంపైన!

Man gifts land on moon to wife: భార్య పుట్టినరోజు సందర్భంగా ఏదైనా వెరైటీగా కానుక ఇవ్వాలనుకున్నాడో భర్త. అనుకున్నదే తడువుగా చంద్రమండలం పైన స్థలాన్ని కొనుగోలు చేసి తన భార్యకు కానుకగా ఇచ్చాడు. భర్త ఇచ్చిన సర్​ప్రైజ్​కు భార్య ఖుషీ అయిపోయింది. ఈ వింత సంఘటన హిమాచల్​ప్రదేశ్​లో జరిగింది.

కంగ్రా జిల్లాకు చెందిన హరీశ్​ మహాజన్​ తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చాడు. గతేడాదే కొనుగోలు చేయాలని అనుకున్నాడు. అందుకోసం ఇంటర్నేషనల్​ లునార్​ ల్యాండ్స్ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది ప్రక్రియ అనంతరం.. సొసైటీ రిజిస్ట్రేషన్​కు సంబంధించిన పత్రాలను ఆన్​లైన్​లో పంపించారు. అయితే కొనుగోలు ఖర్చు చేసిన డబ్బు ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. ఇది ప్రేమకు సంబంధించిన విషయమని.. డబ్బుది కాదని చెప్పాడు. ఇలాంటి కానుక ఇస్తాడని తాను ఊహించలేదని చెప్పింది అతడి భార్య పూజ. హరీశ్ మహాజన్ హిమాచల్​ప్రదేశ్​ నుంచి చంద్రమండలం పైన భూమిని కొనుగోలు చేసిన రెండో వ్యక్తి. అంతకుముందు.. ఉనా జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమారుడికి చంద్రడిపై స్థలం కొనుగోలు చేసి ఇచ్చాడు.

ఇదీ చదవండి: వలపు వలలో బ్యాంక్ మేనేజర్.. 'ఆమె'కు రూ.6కోట్లు గిఫ్ట్.. 'దొంగ లోన్​'తో బడా స్కామ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.