ETV Bharat / bharat

రూ.1300 కోట్లు విలువైన హెరాయిన్​ పట్టివేత

author img

By

Published : Apr 21, 2022, 10:36 PM IST

Updated : Apr 21, 2022, 10:54 PM IST

-DRUGS-SEIZURE
హెరాయిన్​ పట్టివేత

22:29 April 21

గుజరాత్​లో రూ.1300 కోట్లు విలువైన హెరాయిన్​ పట్టివేత

Heroin seized in Gujarat: గుజరాత్​లో మరోమారు భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​(ఏటీఎస్​), డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్​ఐ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో 260 కిలోల హెరాయిన్​ను పట్టుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని తెలిపారు. కచ్​ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్​ స్టేషన్​లో తనిఖీలు నిర్వహించగా ఓ కంటెయినర్​లో భారీగా డ్రగ్స్​ వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు.

ముంద్రా పోర్టులో రెండు కంటెయినర్లలో రూ.21వేల కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్​ పట్టుకున్న కొన్ని నెలల్లోనే భారీ స్థాయిలో డ్రగ్స్​ పట్టుబడటం గమనార్హం. 2021 సెప్టెంబర్​లో ముంద్రా పోర్టులో డ్రగ్స్​ సీజ్​ చేశారు అధికారులు. అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

" ఏటీఎస్​కు విశ్వసనీయవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. డీఆర్​ఐతో కలిసి కుండ్లా పోర్ట్​లోని కంటెయినర్​ స్టేషన్​లో తనిఖీలు చేపట్టారు. కిలోకి రూ.5 కోట్లు విలువైన హెరాయిన్​ మొత్తం 260 కిలోలు లభించింది. కంటెయినర్​ లోపల దాచి తరలిస్తుండగా పట్టుకున్నాం."

- సీనియర్​ అధికారి.

ఇదీ చూడండి: అడవిలో అర్ధనగ్నంగా బాలిక మృతదేహం.. గ్యాంగ్​రేప్​ల కలకలం!

Last Updated :Apr 21, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.