ETV Bharat / bharat

కొచ్చిలో రూ.200 కోట్ల హెరాయిన్ సీజ్.. ముంబయిలో మరో రూ.100 కోట్లు..

author img

By

Published : Oct 6, 2022, 8:25 PM IST

heroin
హెరాయిన్

Heroin Seized In Kerala : కేరళలోని కొచ్చి సముద్రతీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఇరాన్ పడవలో సుమారు రూ.200 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ అధికారులు. మరోవైపు, ముంబయి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు.

Heroin Seized In Kerala : కేరళ కొచ్చి తీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ నేవీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఇరాన్ నుంచి వస్తున్న ఓ పడవలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. పడవలో ఉన్న ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రూ.100 కోట్ల హెరాయిన్ స్వాధీనం.. మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయంలో 16 కేజీల హెరాయిన్​ పట్టుబడింది. డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు.. మలావి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

heroin seized
.

అధికారుల సమాచారం ప్రకారం..
మలావి నుంచి ఖతార్​ మీదుగా ముంబయి వస్తున్న ఓ ప్రయాణికుడు అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నాడన్న సమాచారంతో డెరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్​పోర్టులో ఓ అనుమానితుడిని పట్టుకుని తనిఖీ చేయగా అతడి ట్రాలీ బ్యాగ్​లో 16 కేజీల హెరాయిన్ దొరికింది. ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అయితే ఈ ఘటనతో సంబంధం ఉన్న ఘనాకు చెందిన మరో మహిళను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

heroin seized
.

ఖరీదైన ఏడు వాచ్​లు..
దిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్​పోర్ట్​లో ఓ ప్రయాణికుడి నుంచి ఏడు ఖరీదైన వాచ్​లను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ వాచ్​ల ధర దాదాపుగా రూ.28 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

heroin seized
.
heroin seized
వాచ్​లను స్వాధీనం చేసుకున్న అధికారులు

ఇవీ చదవండి: 'నా భార్య కూడా మీలా తిట్టదు.. ఇలా లవ్​ లెటర్స్ పంపదు'.. గవర్నర్​కు సీఎం కౌంటర్

వందే భారత్​ ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం.. ముందు భాగం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.