ETV Bharat / bharat

Red Alert for Telangana : వచ్చే 3 రోజుల్లో భారీ, అతిభారీ వర్షాలు.. తెలంగాణకు రెడ్ అలర్ట్

author img

By

Published : Jul 18, 2023, 4:04 PM IST

Telangana Weather Report : తెలంగాణకు వరుణుడి గండం పొంచి ఉంది. రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Rains
Rains

Heavy Rains In Telangana For Next 3 Days : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంపై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మరోవైపు ఝార్ఖండ్‌ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణ తూర్పు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో అనేక చోట్ల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో 3 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం :

  • (మొదటి రోజు) రెడ్‌ అలర్ట్ : ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం.
  • ఆరెంజ్‌ అలర్ట్‌ : కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం.
  • ఎల్లో అలర్ట్‌ : ఆదిలాబాద్‌, కొమరంభీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.
  • (రెండో రోజు) ఆరెంజ్‌ అలర్ట్‌ : కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాద్రాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఎల్లో అలర్ట్‌ : ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.
  • (మూడో రోజు) ఆరెంజ్‌ హెచ్చరికలు : వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.
  • ఎల్లో హెచ్చరికలు : ఆదిలాబాద్‌, కొమరం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.