ETV Bharat / bharat

5జీ రద్దు పిటిషన్​పై విచారణ.. జూహీ చావ్లాకు ఊరట

author img

By

Published : Jan 27, 2022, 4:42 PM IST

5g
5జీ రద్దు పిటీషన్​పై జూహీ చావ్లాకు ఊరట

Juhi Chawla 5G: 5జీ పిటిషన్​ వ్యవహారంలో సినీ నటి జూహీ చావ్లాకు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. రూ.20 లక్షల జరిమానాను రూ. 2 లక్షలకు తగ్గించింది హైకోర్టు.

Juhi Chawla 5G: సినీ నటి జూహీ చావ్లాకు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 5జీకు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్​పై​ ఇదివరకు కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అంతేకాకుండా ఆమెకు విధించిన రూ.20 లక్షల జరిమానాను రూ.2 లక్షలకు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. రూ.20 లక్షల జరిమానా విధిస్తూ.. ఇది వరకు దిల్లీ హై కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్​ చేస్తూ.. జూహీ చావ్లా దాఖలు చేసిన పిటిషన్​పై విచారించింది ధర్మాసనం. ఆమె నిర్లక్ష్యధోరణితో 5జీపై కేసును దాఖలు చేయలేదని జస్టిస్​ విపిన్​ సంఘీ, జస్టిస్​ జస్మిత్​ సింగ్​లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆమెపై విధించిన జరిమానాను కూడా తగ్గించింది.

ఇదీ జరిగింది..

5జీ నెట్​వర్క్​ అందుబాటులోకి వస్తే ఆ రేడియేషన్​ ధాటికి పర్యావరణం దెబ్బతింటుందంటూ జూహీ చావ్లా గతేడాది మే నెలలో దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. 5జీ సాంకేతికత మానవాళితో పాటు యావత్​ వృక్ష, జంతుజాలానికి సురక్షితమని అధికారులు ధ్రువీకరించేలా ఆదేశాలివ్వాలని వ్యాజ్యంలో కోరారు జూహీ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇది లోపభూయిష్ట పిటిషన్​గా అభివర్ణించింది. మీడియాలో పబ్లిసిటీ కోసమే వ్యాజ్యాన్ని దాఖలు చేశారని పిటిషన్​పై విచారణ చేపట్టిన జస్టిస్​ జేఆర్​ మిధా వ్యాఖ్యానించారు. ఈ కేసును కొట్టివేస్తూ పిటిషనర్‌ అయిన నటి జుహీ చావ్లాకు రూ.20 లక్షలు జరిమానా విధించారు. ప్రచారం కోసమే పిటిషన్‌ వేసినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : మహిళపై గ్యాంగ్​రేప్.. జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.