ETV Bharat / bharat

హెచ్​ఏఎల్​- బోయింగ్​ బంధంలో మరో మైలురాయి

author img

By

Published : Oct 29, 2021, 12:19 PM IST

10ఏళ్ల బంధాన్ని కొనసాగిస్తూ.. హెచ్​ఏఎల్​-బోయింగ్​ మరో మైలురాయికి చేరాయి. ఎఫ్​/ఏ- 18 సూపర్​ హార్నెట్​ ఎయిర్​క్రాఫ్ట్​లో వినియోగించే 200వ గన్​ బే డోర్​ను బోయింగ్​కు డెలివరీ చేసింది హెచ్​ఏఎల్​.

hal latest news
హెచ్​ఏఎల్​- బోయింగ్​ బంధంలో మరో మైలురాయి

బోయింగ్​కు 200వ గన్​ బే డోర్​ను శుక్రవారం అందించింది హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హెచ్​ఏఎల్)​. వీటిని ఎప్​/ఏ- 18 సూపర్​ హార్నెట్​ ఎయిర్​క్రాఫ్ట్​లో వినియోగిస్తారు.

ఇరు కంపెనీలకు సంబంధించి ఇది ఓ మైలురాయి. 200వ గన్​ బే డోర్​ను డెలివరీ చేసినందుకు గాను సంబంధిత పత్రాలను బోయింగ్​కు చెందిన అశ్వని భార్గవ(డైరక్టర్​-సప్లయర్​ విభాగం) చేతికి ఇచ్చారు హెచ్​ఏఎల్​ చెందిన మానిక వాసగం.

hal latest news
మానిక వాసగం- అశ్వని భార్గవ

బోయింగ్​కు గత పదేళ్లుగా ఎయిరోస్పేస్​కు సంబంధించిన భాగాలను సరఫరా చేస్తోంది హెచ్​ఏఎల్​.

ఇదీ చూడండి:- ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లోకి పవర్​ఫుల్​ హెలికాప్టర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.