ETV Bharat / bharat

Gyanvapi Supreme Court Verdict : జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక్క షరతు!

author img

By

Published : Aug 4, 2023, 6:52 PM IST

Gyanvapi Supreme Court Verdict
Gyanvapi Supreme Court Verdict

Gyanvapi Supreme Court Verdict : కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అలహాబాద్​ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పాటు ఒక షరతు కూడా విధిచింది. అదేంటంటే?

Gyanvapi Supreme Court Verdict : జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఏ​ఎస్​ఐకి శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సర్వేను 'నాన్‌-ఇన్వేసివ్‌ టెక్నిక్‌'లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వాదనలు విన్న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్​ మిశ్రతో కూడిన ధర్మాసనం.. మసీదు నిర్మాణాన్ని ధ్వంసం చేసేలా సర్వేలో ఎలాంటి పరికరాలను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.

Gyanvapi Mosque Supreme Court : 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదులో.. వజూఖానా మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే జరిపి.. హిందూ ఆలయం స్థానంలో మసీదును నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధరించాలని వారణాసి జిల్లా ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో అలహాబాద్‌ హైకోర్టు కూడా ఏకీభవించింది. మసీదు ప్రాంగణంలో ఏఎస్​ఐ సర్వే కొనసాగించేందుకు అనుమతించింది. దీంతో శుక్రవారం ఉదయం పురావస్తు శాఖ అధికారులు సర్వే చేపట్టారు.

Gyanvapi High Court : అయితే అలహాబాద్​ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం శనివారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. ప్రార్థనా ప్రదేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఏఎస్‌ఐ.. 500 ఏళ్ల నాటి చరిత్రను తిరగదోడాలని చూస్తోందని వాదించింది. ఇలా చేస్తే గత గాయాలను మళ్లీ తెరిచినట్టే అని ధర్మాసనానికి నివేదించింది. ఏఎస్​ఐ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు. సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టడం లేదని, నిర్మాణాలకు ఎలాంటి విధ్వంసం జరగదని హామీ ఇచ్చారు.

సర్వే పూర్తికి అదనపు గడువు..
Gyanvapi Case Varanasi Court : జ్ఞాన్​వాపి మసీదుపై శాస్త్రీయ సర్వేను పూర్తి చేసేందుకు ఏఎస్​ఐకు.. వారణాసి కోర్టు శుక్రవారం అదనంగా నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు ఏఎస్​ఐ పిటిషన్​ను విచారించిన జిల్లా జడ్జి ఏకే విశ్వేష.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 4 వరకు గడువు పొడిగించినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మోహన్ యాదవ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.