ETV Bharat / bharat

పాక్​కు రహస్య సమాచారం... బీఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ అరెస్టు

author img

By

Published : Oct 25, 2021, 10:50 PM IST

పాకిస్థాన్​కు రహస్య సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో సరిహద్దు భద్రతా దళ(బీఎస్​ఎఫ్​) కానిస్టేబుల్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం(Gujarat Anti Terrorism Squad) అరెస్టు చేసింది. అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, సిమ్​కార్డులు స్వాధీనం చేసుకుంది.

Gujarat ATS
బీఎస్​ఎఫ్​ జవాను అరెస్టు

గుజరాత్​ భుజ్​ బెటాలియన్​కు చెందిన సరిహద్దు భద్రతా దళ(బీఎస్​ఎఫ్​) కానిస్టేబుల్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​)(Gujarat Anti Terrorism Squad) అరెస్టు చేసింది. పాకిస్థాన్​కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడ్ని జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్​ సజ్జద్​గా అధికారులు గుర్తించారు. భుజ్​లోని బీఎస్​ఎఫ్​ 74వ బెటాలియన్​లో ఈ ఏడాది జులైలో అతడు నియమితుడయ్యాడని చెప్పారు.

bsf constable arrest by gujarat ats
నిందితుడు, బీఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ సజ్జద్​

"సజ్జద్​ 2012లో కానిస్టేబుల్​గా బీఎస్​ఎఫ్​లో చేరాడు. పాకిస్థాన్​కు రహస్య​ సమాచారాన్ని అందించడం వల్ల అతని సోదరుడు వాజిద్​, సహోద్యోగి ఇక్బాల్ రషీద్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. జమ్మూలో రీజినల్ పాస్​పోర్టును అతడు తీసుకున్నాడు. దానితో 2011 డిసెంబరు 1, 2012 జనవరి 16 మధ్య 46 రోజుల పాటు పాక్​లో పర్యటించాడు. అటారీ రైల్వే స్టేషన్​ నుంచి సమ్​జౌతా ఎక్స్​ప్రెస్​లో అతడు పాకిస్థాన్​కు వెళ్లాడు."

-గుజరాత్ ఏటీఎస్​

వాట్సాప్​ ద్వారా రహస్య సమాచారాన్ని సజ్జద్​.. పాక్​కు చేరవేశాడని ఏటీఎస్​ తెలిపింది. అంతేగాకుండా తప్పుడు జన్మ ధ్రువీకరణ పత్రం సమర్పించి బీఎస్​ఎఫ్​ను తప్పుదోవ పట్టించాడని చెప్పింది. ఆధార్​ కార్డు ప్రకారం సజ్జద్​ 1992 జనవరి 1న జన్మించినట్లు ఉండగా.. పాస్​పోర్టు ప్రకారం అతడు 1985 జనవరి 30న పుట్టినట్లుగా ఉందని పేర్కొంది.

సజ్జద్ వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, వాటి సిమ్​కార్డులతో పాటు, మరో రెండు సిమ్​కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు​ తెలిపారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భారత్​-పాక్ మ్యాచ్​లో ఓటమిపై విద్యార్థుల ఫైట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.