ETV Bharat / bharat

అప్పటి వరకు దేశమంతా ఆంక్షలు: కేంద్రం కీలక ప్రకటన

author img

By

Published : Oct 28, 2021, 6:21 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి(Covid-19 India) విధించిన ఆంక్షలను(Covid 19 Containment) నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్​ భల్లా సమావేశం నిర్వహించారు.

containment measures
కొవిడ్ ఆంక్షలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్-19​ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను(Covid 19 Containment) నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్​ భల్లా సమావేశం నిర్వహించారు.

దేశంలో రోజువారీ కేసులు, వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ విజృంభణ(Covid-19 India) సవాల్​గా మారిందని అజయ్ కుమార్​ భల్లా తెలిపారు.

"పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఐసీయూ పడకల సామర్థ్యం.. తదితర అంశాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పండగ సీజన్​లో వైరస్ వ్యాప్తిని ఐదు విభాగాల(టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్​, బిహేవియర్​) ద్వారా కట్టడి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిరవధికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలి."

-- అజయ్ కుమార్​ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి

రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు.. ఆయా జిల్లాల్లోని అధికారులకు కొవిడ్ కట్టడిపై(Covid-19 India) దిశానిర్దేశం చేయాలని అజయ్ కుమార్ భల్లా సూచించారు.

దేశంలో ఇప్పటివరకు కొవిడ్​-19(Corona Cases In India) బారిన పడిన వారి సంఖ్య 3,42,31,809కు చేరింది. మరోవైపు ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య(Covid Vaccination In India) 1,04,04,99,873 కి చేరింది.

ఇదీ చూడండి: దిల్లీలో 97% మందిలో కరోనా యాంటీబాడీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.