ETV Bharat / bharat

Gold Utensils For G20 : అతిథిదేవో భవ! జీ20 దేశాధినేతలకు బంగారు పాత్రల్లో విందు.. చూస్తే ఔరా అనాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 9:18 PM IST

Gold Utensils For G20 Summit
Gold Utensils For G20 Summit

Gold Utensils For G20 Summit : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీ20 సదస్సును ఈసారి మనదేశంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్రం.. చేసిన ఏర్పాట్లు ఔరా అనిపిస్తున్నాయి. దేశాధినేతలు భోజనం చేసేందుకు బంగారం, వెండి పాత్రలను అందంగా తయారు చేయించారు. సాధారణంగా విదేశాల్లో సమావేశాలు జరిగితే గ్లాస్‌, పింగాణీ పాత్రల్లో వడ్డిస్తారు. అయితే.. భారతీయ సంప్రదాయాలు, హుందాతనం ఉట్టిపడేలా ప్రభుత్వం ఈ విధంగా బంగారం, వెండి లోహాలతో పాత్రలు సిద్ధం చేశారు.

Gold Utensils For G20 Summit : 2023 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మకమైన జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైన భారత్‌.. అందుకు భారీ ఏర్పాట్లు చేసింది. అగ్ర దేశాల అధినేతలు భోజనం చేసేందుకు అద్భుతమైన పాత్రలు తయారు చేయించింది. ఇందుకు ఓ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది.

మహారాజులు, చక్రవర్తులు విందులో కూర్చుంటే..
G20 Summit Gold Silver Utensils : ఆ సంస్థ తయారు చేసిన పాత్రలు చూస్తే ఔరా అనాల్సిందే. మహారాజులు, చక్రవర్తులు విందులో కూర్చుంటే కనిపించే పాత్రలా అనేలా అవి ఉన్నాయి. సాధారణంగా వేరే దేశాల్లో ప్రతినిధులకు ఏర్పాటు చేసే విందులో పింగాణీ, గ్లాస్‌లతో తయారు చేసిన పాత్రలే కనిపిస్తుంటాయి. భారత్‌లో మాత్రం పూర్తిగా బంగారం వెండితోనే తయారు చేసిన పాత్రలు కనిపిస్తున్నాయి.

Gold Utensils For G20 Summit
దేశాధినేతలకు వెండి గ్లాస్​లు
Gold Utensils For G20 Summit
బంగారు ప్లేట్​లు, గ్లాస్​లు

ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత..
Gold Utensils For G20 Guests : జీ20 కోసం తయారు చేసిన ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత ఉందని తయారీ దారులు చెబుతున్నారు. వీటి తయారీకి ముందు వివిధ రాష్ట్రాల్లో పర్యటించామని, భారత సంస్కృతికి అద్దం పట్టేలా వీటిని తయారు చేసినట్లు తెలిపారు. దక్షిణ భారతంలో పర్యటించి అరిటాకు డిజైన్‌ ఉన్న కంచాన్ని తయారు చేశారు.

Gold Utensils For G20 Summit
దేశాధినేతలకు వెండి పాత్రల్లో ఆతిథ్యం

వెండి ప్లేట్​లో మూడు సింహాల ముద్రణ..
Silver Utensils For G20 Summit : అలాగే జాతీయ పక్షి నెమలి ఆకృతిలో మంచినీరు సర్వ్‌ చేసే పాత్రలు రూపొందించారు. పానీయ పాత్రలపై పుష్పాలు, లతలను ముద్రించారు. పండ్లు అందించేందుకు నెమలి పింఛం ఆకృతిలో ప్లేట్‌ రెడీ చేశారు. ఓ వెండి కంచెంలో భారత జాతీయ చిహ్నం మూడు సింహాలను ముద్రించారు. అతిథి దేవో భవః అనే భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా వీటిని కేంద్రం తయారు చేయించిందని తయారీ దారులు చెప్పారు.

Gold Utensils For G20 Summit
అతిథులకు బంగారు, వెండి పాత్రల్లో విందు
Gold Utensils For G20 Summit
బంగారు గిన్నెలు, స్పూన్​లు

జీ20 సదస్సుకు.. వచ్చేదెవరు? రానిదెవరు?
G20 Summit 2023 Guest List : భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అనేక కీలక దేశాల అధినేతలు హాజరుకాబోతున్నారు. 20 కీలక ఆర్థిక దేశాల ఈ కూటమిలోంచి ఎవరెవరు వస్తున్నారో.. కావట్లేదో తెలుసుకుందాం.

వస్తున్నవారు వీరు..

  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌
  • బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌
  • ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌
  • కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో
  • జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌
  • జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా
  • దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌యోల్‌
  • ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌
  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బదులు ఆ దేశ ప్రధాని లీ చియాంగ్‌
  • బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా
  • తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగన్‌
  • అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌
  • నైజీరియా అధ్యక్షుడు బొలా తినుబు
  • దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసాలు

రానివారు వీరు..
ఉక్రెయిన్‌ యుద్ధంతో తలమునకలవుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జీ-20 సదస్సుకు హాజరు కావటం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వస్తున్నారు. ఐరోపా యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లియోన్‌ వచ్చేదీ లేనిదీ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రడోర్‌ కూడా సదస్సుకు రాకపోవచ్చు. ఇటలీ ప్రధాని, ఇండోనేసియా అధ్యక్షుడి రాకపైనా స్పష్టత లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.