ETV Bharat / bharat

అత్యాచారం ఆరోపణలతో మంత్రి రాజీనామా

author img

By

Published : Dec 16, 2021, 1:56 PM IST

Updated : Dec 16, 2021, 2:40 PM IST

Goa Minister Resigns: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు గోవా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మిలింద్​ నాయక్​. మరోవైపు ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా కూడా ఎమ్మెల్యేగా, భాజపా సభ్యురాలిగా తప్పుకున్నారు.

Goa Minister Milind Naik
అత్యాచారం ఆరోపణలతో మంత్రి రాజీనామా

Goa Minister Resigns: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో గోవా పట్టణాభివృద్ధి శాఖ​ మంత్రి​ మిలింద్​ నాయక్​ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఆరోపణలపై దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే మిలింద్​ తన పదవి నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. మిలింద్​ రాజీనామాను ఆమోదించి గవర్నర్​కు పంపించామని వెల్లడించింది.

మిలింద్​.. బిహార్​కు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు గిరీష్​ చోదన్కర్​ గత నెల 30న ఆరోపించారు.

ఎమ్మెల్యే రాజీనామా..

భాజపా ఎమ్మెల్యే అలీనా సల్దన్హా కూడా తాను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్​ కార్యాలయంలో సమర్పించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ నుంచి కూడా తప్పుకున్నారు అలీనా. 2012లో తన భర్త మరణం తర్వాత తాను భాజపాలో చేరినప్పటి సమయానికి, ప్రస్తుతానికి పార్టీలో చాలా మార్పులు జరిగాయని అన్నారు అలీనా.

నాటి గోవా ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కేబినెట్​లో మంత్రిగా చేసిన అలీనా భర్త మథానీ సల్దాన్హా.. 2012లో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వత జరిగిన ఉపఎన్నికల్లో అలీనా పోటీ చేసి విజయం సాధించారు.

ఇదీ చూడండి : 'షీనా బోరా చనిపోలేదు.. కశ్మీర్​లో ఉంది'.. సీబీఐకి ఇంద్రాణీ లేఖ

Last Updated :Dec 16, 2021, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.