ETV Bharat / bharat

అన్న ప్రేమపై తమ్ముడి ఆగ్రహం- ఆమెపై కిరోసిన్​ పోసి..

author img

By

Published : Jul 12, 2021, 4:40 PM IST

Updated : Jul 12, 2021, 6:21 PM IST

Woman set afire
అన్న ప్రేమపై తమ్ముడి ఆగ్రహం

తన అన్న ప్రేమను వ్యతిరేకించిన ఓ వ్యక్తి.. క్రూరంగా ప్రవర్తించాడు. తన సోదరుడి ప్రేయసిపై కిరోసిన్​ పోసి నిప్పింటించాడు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ దారుణ ఘటన.

ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​షహర్​ జిల్లాలో సోమవారం దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో ఓ యువతిపై కిరోసిన్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి.

అసలేమైంది?

ముండాఖేడా గ్రామానికి చెందిన బాధిత యువతి(20).. నిందితుడి అన్నతో ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. వారి ప్రేమను వ్యతిరేకించిన నిందితుడు కిరోసిన్​ పోసి నిప్పంటించాడని చెప్పారు.

girl burnt
కాలిపోయిన బాధితురాలి దుస్తులు
girl burnt
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

బాధిత యువతితో పాటు ఆమె ప్రేమించిన వ్యక్తిది ఒకే సామాజికవర్గం అని సీనియర్​ సూపరింటిండెంట్​ ఆఫ్​ పోలీస్​(ఎస్ఎస్పీ) సంతోష్​ కుమార్ సింగ్​ తెలిపారు. వారిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయని చెప్పారు. 40 శాతం శరీరం కాలగా... ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో బాధిత యువతి చికిత్స పొందుతోందని చెప్పారు.

ఇదీ చూడండి: వాహనదారులపై పులి దాడి.. ఇద్దరు మృతి

ఇదీ చూడండి: పిడుగుల బీభత్సం-28 మంది మృతి

Last Updated :Jul 12, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.