ETV Bharat / bharat

కాంగ్రెస్​పై ఆజాద్​ సంచలన వ్యాఖ్యలు.. ప్రజలను విభజిస్తోందంటూ..!

author img

By

Published : Mar 20, 2022, 5:43 PM IST

Updated : Mar 20, 2022, 5:55 PM IST

Ghulam Nabi Azad on Kashmir Files: ప్రజలను కులం, మతం వంటి పలు అంశాల ఆధారంగా విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయని, అందులో సొంత పార్టీ సైతం ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. కశ్మీర్​ పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్థాన్​, ఉగ్రవాదులే కారణమని నొక్కిచెప్పారు.

Ghulam Nabi Azad
కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​

Ghulam Nabi Azad on Kashmir Files: వివిధ అంశాల ఆధారంగా ప్రజలను కాంగ్రెస్​ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, జీ23 గ్రూప్​ సభ్యుడు గులాం నబీ ఆజాద్​. 1990లో కశ్మీర్​ పండిట్లపై జరిగిన మారణహోమాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్​ లోయలో పండిట్లపై జరిగిన ఘటనలకు పాకిస్థాన్​, ఉగ్రవాదులే కారణమని పేర్కొన్నారు.

జమ్మూలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు ఆజాద్​. సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. 'ద కశ్మీర్​ ఫైల్స్​' చిత్రంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

"కులం, మతం సహా ఇతర అంశాల ఆధారంగా 24x7 ప్రజలను విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. నా సొంత పార్టీతో (కాంగ్రెస్​) పాటు ఏ పార్టీని విస్మరించటం లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా ఏ పార్టీని క్షమించను. పౌర సమాజం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలి. కులం, మతం చూడకుండా అందరికి సమానంగా న్యాయం అందాలి. మహాత్మాగాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది. జమ్ముకశ్మీర్​లో 1990లో జరిగిన దానికి పాకిస్థాన్​, ఉగ్రవాదులే కారణం. దాని ద్వారా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కశ్మీర్​ పండిట్​ వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. "

- గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

1990 దశకంలో కశ్మీర్​ పండిట్లపై జరిగిన మారణకాండ ఆధారంగా తెరకెక్కిన ద కశ్మీర్​ ఫైల్స్​ చిత్రం మార్చి 11న విడుదలైంది. అప్పటి నుంచి భాజపా, విపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. ఈ చిత్రానికి మద్దతు పలికారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఇదీ చూడండి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భాజపా విశ్లేషణ.. టార్గెట్ '2024'!

కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథ.. 'ది కశ్మీర్​ ఫైల్స్​'

Last Updated :Mar 20, 2022, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.