ETV Bharat / bharat

70మంది సెక్స్​వర్కర్లను కాపాడిన కానిస్టేబుల్

author img

By

Published : Nov 6, 2020, 2:34 PM IST

gb road fire beat constable of delhi police saves 70 sex workers life
70మంది సెక్స్​వర్కర్లను మంటల నుంచి కాపాడిన కానిస్టేబుల్

మంటల్లో చిక్కుకున్న 70మంది సెక్స్​ వర్కర్లను కాపాడారు ఓ కానిస్టేబుల్​. అతడి కృషి వల్ల ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం దిల్లీలోని జీబీ రోడ్​లో జరిగింది.

కానిస్టేబుల్​ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల దిల్లీలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం తప్పింది. దిల్లీలోని జీబీ రోడ్​ కోటా నంబర్- 58లో సెక్స్​ వర్కర్లు నివసించే ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బీట్ కానిస్టేబుల్​ వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికుల సాయంతో భవనంలో ఉన్న 70 మంది సెక్స్​వర్కర్లు వారి పిల్లలను కష్టం మీద కాపాడారు.

కానిస్టేబుల్ సమయానికి రాకుంటే చాలామంది మంటల్లో కాలిపోయేవారని స్థానికులు వెల్లడించారు. అనంతరం కానిస్టేబుల్​ను అభినందిచారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.