ETV Bharat / bharat

గ్యాంగ్​స్టర్లకు, తీవ్రవాదులకు లింక్​... దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ సోదాలు

author img

By

Published : Nov 29, 2022, 10:10 AM IST

NIA conducts multi state raids
national intelligence agency

గ్యాంగ్​స్టర్లకు, తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, దిల్లీ, రాజస్థాన్​తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్​స్టర్ల స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు.

గ్యాంగ్​స్టర్లకు, తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, దిల్లీ, రాజస్థాన్​తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్​స్టర్ల ఇళ్లల్లో అధికారులు రైడ్స్​ నిర్వహించారు. ఇప్పటికే యాంటీ టెర్రర్ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియాతో పాట గోల్డీ బ్రార్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అక్టోబర్‌లో నాలుగు రాష్ట్రాలతో పాటు దిల్లీలోని 52 ప్రదేశాలలో ఎన్ఐఏ విస్తృత సెర్చ్ ఆపరేషన్​ నిర్వహించింది. ఈ సోదాల్లో ఆసిఫ్​ ఖాన్​ అనే న్యాయవాదితో పాటు హరియాణాకు చెందిన ఓ గ్యాంగ్​స్టర్​ను అధికారులు అరెస్టు చేశారు. ఉస్మాన్​పుర్​లోని గౌతమ్​ విహార్​కు చెందిన న్యాయవాది ఆసిఫ్ ఖాన్ ఇంట్లో జరిపిన సోదాల్లో నాలుగు ఆయుధాలతో పాటు పలు పిస్టోళ్లను ఎన్​ఐఏ స్వాధీనం చేసుకుంది. న్యాయవాదికి.. జైలులో ఉన్న గ్యాంగ్​స్టర్లతో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో రుజువయ్యింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.