ETV Bharat / bharat

'నిర్భయ' తరహా దారుణం.. సాముహిక అత్యాచారం చేసి.. ఆపై..

author img

By

Published : May 22, 2022, 10:50 PM IST

Gangrape Case: ఛత్తీస్​గఢ్​లో నిర్భయ గ్యాంగ్ రేప్ తరహా ఘటన వెలుగుచూసింది. సుర్గుజా అడవుల్లో ఓ యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను, ఆమె భాగస్వామిని దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు కారకులైన నిందితుల్ని పోలీసులు.. రెండు గంటల్లోనే అరెస్టు చేశారు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన యువతి.. చనిపోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఐజీకి లేఖ రాసింది.

Gangrape Case
Gangrape Case

Gangrape Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు లాంటి ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. సుర్గుజా అడవిలో ఓ యువతిపై నలుగురు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో ఆమె భాగస్వామిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత బాధితురాలి బ్యాగులో ఉంచిన డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు గంటల్లోనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్​ ఉన్నాడు.

చుట్టుపక్కల గ్రామాలపై పోలీసులు దాడులు.. విచారణలో భాగంగా సుర్గుజా పోలీసులు సమీప గ్రామాలపై దాడులు చేశారు. వేర్వేరు వ్యక్తులను వివిధ కోణాల్లో విచారించారు. అదే సమయంలో పోలీసులను చూసిన ఓ అనుమానితుడు భయాందోళనకు గురయ్యాడు. బాధితురాలు అతడిని గుర్తించింది. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సామూహిక అత్యాచారం కేసులో నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడిగా సంతోష్ యాదవ్​, మిగతా వారిని అభిషేక్​ యాదవ్​, నాగేంద్ర యాదవ్​గా పోలీసులు గుర్తించారు.

చనిపోవడానికి అనుమతించాలని లేఖ.. ఉత్తర్​ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ యువతి.. చనిపోవడానికి అనుమతించాలని ఐజీకి లేఖ రాసింది. గత ఆరు నెలలుగా తనను గుర్తుతెలియని దుండగులు వేధిస్తున్నారని, మెసేజ్‌ల ద్వారా దుర్భాషలాడుతున్నారని ఆమె ఆరోపించింది. తన తల్లిదండ్రులు, తోబుట్టువులను కూడా ఇలాగే వేధిస్తున్నారని చెప్పింది.
తాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని ఇంకా అరెస్ట్​ చేయలేదని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై డీఎస్పీ అంబికా నారాయణ్ స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఆమె మానసిక క్షోభ తారా స్థాయికి చేరిందని, ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని ఆమె సోదరుడు చెప్పాడు.

ఇవీ చదవండి: ఇంటిని గ్యాస్‌ ఛాంబర్‌గా మార్చి.. ఊపిరాడకుండా చేసుకొని.. తల్లీకూతుళ్లు ఆత్మహత్య

ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ఆరుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.