ETV Bharat / bharat

డ్రగ్స్​ ఇచ్చి.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్​​ రేప్​

author img

By

Published : Dec 25, 2021, 2:16 PM IST

Gang rape on minor girl: ట్యూషన్​కు వెళ్లిన పదో తరగతి విద్యార్థినిని అపహరించి.. నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు బలవంతంగా డ్రగ్స్​ ఇచ్చి ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​లో జరిగింది. మహారాష్ట్రలోని వాషిమ్​లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వేద పాఠశాల ఉపాధ్యాయుడు.

student gang-raped
డ్రగ్స్​ ఇచ్చి గ్యాంప్​ రేప్​

Gang rape on minor girl: దేశంలో బాలికలు, మహిళలపై మానవ మృగాల ఆకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పదో తరగతి విద్యార్థినిని అపహరించి, మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​లో గురువారం జరిగింది.

బాలిక ట్యూషన్​ క్లాసులకు వెళ్లి తిరిగివస్తోంది. అక్కడే కాపు కాసిన ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి సదపుర్​ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు వేచి ఉన్నారు. బాలికకు బలవంతంగా డ్రగ్స్​ ఇచ్చి నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

బాలిక ఇంటికి రాకపోవటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. పోలీసులు, బంధువులు స్థానిక ప్రాంతాల్లో వెతకగా.. అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. మత్తు నుంచి తేరుకున్నాక తనపై జరిగిన దుశ్చర్యను కుటుంబ సభ్యులకు వివరించింది బాలిక.

నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు స్థానిక జన్సాథ్​ పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​ఓ బబ్లూ సింగ్​ వర్మ. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

మైనర్​పై వేద పాఠశాల ఉపాధ్యాయుడి అత్యాచారం

మహారాష్ట్ర, వాషిమ్​లోని ఓ వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు 12 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద.. టీచర్​ అజయ్​ పాఠక్​ను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని శ్రీ నరసింగ్​ సరస్వతి స్వామి మహారాజ్​ వేద పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. కాళ్లు నొక్కాలని బాధితురాలిని పిలిచి.. ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

అఘాయిత్యంపై బాధితురాలు వివరించిన క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు, బంధువులు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు పోలీసులు.

ఇదీ చూడండి: Gang rape on minor girl: బాలికపై 400 మంది లైంగిక దాడి.. !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.