ETV Bharat / bharat

మెడికోపై ఐదుగురు.. దళిత యువతిపై 8మంది గ్యాంగ్​ రేప్​.. రంగంలోకి సీఎం

author img

By

Published : Mar 23, 2022, 6:20 PM IST

Tamilnadu Gang rape case: ఓ దళిత యువతిని బ్లాక్​ మెయిల్​ చేస్తూ ఎనిమిది మంది, వైద్య విద్యార్థినిని అపహరించి ఐదుగురు గ్యాంగ్​ రేప్​కు పాల్పడిన ఘటనలు తమిళనాడులో దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. దళిత యువతి కేసును సీబీసీఐడీకి అప్పగించినట్లు అసెంబ్లీలో వెల్లడించారు.

gang rape
దళిత యువతిపై నెలలుగా గ్యాంగ్​ రేప్​

Tamilnadu Gang rape case: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసగించి, బ్లాక్​ మెయిల్​ చేస్తూ కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. ఈ సంఘటన తమిళనాడులోని విరుధునగర్​ జిల్లా కేంద్రంలో జరిగింది. అరెస్ట్​ అయిన వారిలో నలుగురు మైనర్లేనని, ఇద్దరు డీఎంకే కార్యకర్తలని పోలీసులు చెప్పారు.

ఇదీ జరిగింది: విరుధునగర్​లోని మేల్​ వీధికి చెందిన హరిహరన్​(27) అనే వ్యక్తి నగరంలోని ఓ దళిత యువతిని ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ దుశ్చర్యను వీడియో తీశాడు. దానిని తన స్నేహితులకు పంపించాడు. ఆ వీడియోను చూపిస్తూ బాలికను బ్లాక్​ మెయిల్​ చేసి కొన్ని నెలల పాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు అతని స్నేహితులు. అందులో నలుగురు మైనర్లు ఉన్నారు. వారి హింసను భరించలేని బాధితురాలు మార్చి 20న పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు విరుధునగర్​ గ్రామీణ పోలీసులు. నలుగురు మైనర్లు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు.

రాజకీయ దుమారం: ఈ ఘటనపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. 'విరుధునగర్​లో 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుల్లో నలుగురిని కేసు నమోదైన 24 గంటల్లోనే పట్టుకున్నాం. వారిని జువనైల్​ హోమ్​కు తరలించాం. ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశాం. ఈ కేసులో సీబీసీఐడీ సూపరింటెండెంట్​ ముథరాసిని ప్రత్యేక​ అధికారిగా నియమించాం. 60 రోజుల్లో అభియోగ పత్రం​ దాఖలు చేస్తాం. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రత్యేక కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని డీజీపీకి సూచించా. ఇలాంటి నేరాలు చేస్తే తక్షణం చర్యలు ఉంటాయనేందుకు ఈ కేసు ఉదాహరణ. నిందితులకు ఓ గుణపాఠం.' అని పేర్కొన్నారు.

వైద్య విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్​: తమిళనాడు, వెల్లూర్​లో ఓ యువతి సెకండ్​ షో సినిమా చూసి వస్తుండగా అపహరించి ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 21న రాత్రి జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది.

ఇదీ జరిగింది: బిహార్​కు చెందిన యువతి, నాగ్​పుర్​కు చెందిన తన స్నేహితుడితో కలిసి మార్చి 17న సెకండ్​ షో సినిమాకు వెళ్లింది. మూవీ చూసుకుని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అర్ధరాత్రి ఒంటి గంటకు ఆటోలో ఇరువురు బయలుదేరారు. ఆటోలో మరికొంత మంది ఎక్కారు. వారిని ఆసుపత్రి వద్ద దింపకుండా.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కత్తితో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్ద ఉన్న మొబైల్​ ఫోన్లు, రూ.40,000 నగదు, ఆభరణాలను లాక్కెళ్లారు.

దుండగులకు భయపడి ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు యువతి వెనకడుగువేసింది. అయితే, మార్చి 22న వెల్లూరు జిల్లా ఎస్పీకి ఈమెయిల్​ ద్వారా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితుల్లో నలుగురిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో నలుగురూ మైనర్లేనని చెప్పారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: అలా చెప్పి ఇంటికి తీసుకెళ్లి.. యువతిపై గ్యాంగ్​రేప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.