జువైనల్​ హోమ్​లో దారుణం.. తోటి ఖైదీలపై ఐదుగురు అత్యాచారం

author img

By

Published : Nov 10, 2022, 11:01 PM IST

Updated : Nov 11, 2022, 7:26 AM IST

five boys committed misdeeds two boys

రాజస్థాన్​ జువైనల్​ హోమ్​లో దారుణం జరిగింది. ఓ ఐదుగురు ఖైదీలు తోటి ఖైదీలపై దాడి చేసి అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న జైలు అధికారులు, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజస్థాన్​​ జైపుర్​లోని జువెనైల్ హోమ్​లో దారుణం జరిగింది. ట్రాన్స్​పోర్ట్​నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని జువెనైల్​ హోమ్​లో ఉంటున్న ఐదుగురు ఖైదీలు.. తోటి ఖైదీలపై దాడి చేశారు. అనంతరం అసహజ రీతిలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైన చెబితే తీవ్రమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని బాధితులను బెదిరించారు. బుధవారం ఈ విషయం జైలు అధికారుల దృష్టికి వచ్చింది. వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం...
జువనైల్​ హోమ్​లో ఉంటున్న ఖైదీ నెంబర్​ 256... రాత్రి తన గదిలో నిద్రపోతున్నాడు. అదే సమయంలో ఐదుగురు వ్యక్తులు గదిలోకి ప్రవేశించారు. ఖైదీ నెంబర్​ 256ను బంధించి ప్యాంట్​ను​ చింపేశారు. అనంతరం అతనిపై వికృత చర్యకు పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 266వ నెంబర్ ఖైదీ సైతం గత కొద్ది రోజులుగా ఆ ఐదుగురు తనపైన పలుమార్లు దాడి చేసి అత్యాచారం చేశారని చెప్పాడు. కాగా బాధితులు ఇద్దరు అల్వార్​ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.

"జువెనైల్​ హోమ్​లో ఉంటున్న 18, 24 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు ఖైదీలపై, అక్కడే ఉంటున్న 18 నుంచి 20 సంవత్సరాల వయస్సు ఉన్న ఐదుగురు ఖైదీలు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై హత్య, అత్యాచారం కింద కేసులు నమోదు చేశాం. విచారణ సైతం జరుగుతోంది" అని ఆదర్శనగర్ ఏసీపీ హవాసింగ్​ తెలిపారు.

రెండు కేంద్రాలు ఒకే భవంలో..
ఇక్కడి చిల్ట్రన్ కరెక్షన్ హోమ్​లో రెండు కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒకదాంట్లో జువెనైల్ హోమ్ ఉందని, 18 ఏళ్ల లోపు చిన్నారులు ఇందులో ఉంటారని, మరో కేంద్రంలో 18 ఏళ్ల పైబడినవారు ఉంటారని వెల్లడించారు. రెండు కేంద్రాలు ఒకే భవంలో ఉండటం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పారు.

Last Updated :Nov 11, 2022, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.