ETV Bharat / bharat

FTCCI Excellence Awards 2023 : 'రామోజీ ఫిల్మ్‌సిటీ'కి ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు

author img

By

Published : Jul 3, 2023, 8:24 PM IST

Updated : Jul 3, 2023, 9:02 PM IST

FTCCI Excellence Tourism Award for RFC : పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌ సిటీకి... మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యాటకరంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ చేస్తున్న విశేష కృషికిగానూ... ఎఫ్​టీసీసీఐ ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో.... తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా.. ఫిల్మ్‌సిటీ ఎండీ సీ.హెచ్‌.విజయేశ్వరి అవార్డు అందుకున్నారు.

Ramoji Film City
Ramoji Film City

FTCCI Excellence Tourism Award for Ramoji Film City : పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌ సిటీకి... మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యాటకరంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ చేస్తున్న విశేష కృషికిగానూ... తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య-(ఎఫ్​టీసీసీఐ).... ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.... తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా.. రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీ.హెచ్‌.విజయేశ్వరి అవార్డు అందుకున్నారు.

Ramoji Film City
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు అందుకుంటున్న రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి

FTCCI Excellence Awards 2023 : పర్యాటక రంగంలో రామోజీ ఫిల్మ్‌సిటీ... స్థిరమైన, నిబద్ధతతో కూడిన ప్రయాణాన్ని సాగిస్తోందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు కోసం... ఎఫ్​టీసీసీఐకి 22 రంగాలలో 150 దరఖాస్తులు రాగా... అందులో రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్... పారిశ్రామిక రంగంలో తెలంగాణ కనబరుస్తున్న ప్రతిభ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే భవిష్యత్ తరాలు ఏ విధంగా నడుచుకోవాలనే దానిపై పలు సూచనలు చేశారు.

KTR Speech at FTCCI Excellence Awards 2023 : గతంలో ఉన్న రాజకీయ నాయకులు ఒకరు పట్టణాభివృద్ది, మరొకరు పల్లెలు అభివృద్ది చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం రెండూ సమానుకూలంగా చేశారని ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్‌ క్లాస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్లోబల్​గా థింక్ చేయాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎప్పుడూ కొత్త వారికి ఆహ్వానం పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే తరం ప్రజలైనా వైడ్​గా ఆలోచించి స్మార్ట్‌గా పనిచేయాలన్నారు.

'రామోజీ ఫిల్మ్‌సిటీ'కి ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు

ఇవీ చదవండి :

Last Updated : Jul 3, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.