ETV Bharat / bharat

బోరుబావిలో పడిన బాలుడి కథ సుఖాంతం​

author img

By

Published : May 7, 2021, 8:48 AM IST

Borewell, Child
బోరుబావి, చిన్నారి

రాజస్థాన్​లో బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది. ఇందుకోసం సుమారు 20 గంటలపాటు శ్రమించారు అధికారులు.

ఆటలాడుతూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుణ్ని క్షేమంగా రక్షించారు అధికారులు. రాజస్థాన్​లోని సాంచోర్​ ప్రాంతం, లాచ్డి గ్రామంలో బుధవారం(ఈ నెల 5న) ఈ ఘటన జరగ్గా.. సుమారు 20 గంటలపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారిని కాపాడారు ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది.

Child in Borewell
బోరుబావిలోపడ్డ బాలుడి దృశ్యాలు
Child with Rescue team
వైద్య పర్యవేక్షణలో చిన్నారి

శుక్రవారం తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. అనంతరం.. బాలుడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యల పర్యవేక్షణలో ఉంచారు.

ఇదీ చదవండి: అపార్ట్​మెంట్​లోనే 'మినీ కొవిడ్​ కేర్​ సెంటర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.