ETV Bharat / bharat

తిహాడ్​ జైల్లో ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యాయత్నం- మరొకరు ఫోన్​ మింగేసి..

author img

By

Published : Jan 6, 2022, 10:46 AM IST

Updated : Jan 6, 2022, 11:47 AM IST

five prisoners attempt suicide in tihar jail delhi
తిహాడ్ జైల్లో ఐదుగురు ఖైదీల ఆత్మహత్యాయత్నం

Tihar jail prisoners: తిహాడ్​ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్యహత్యకు ప్రయత్నించారు. పదునైన ఆయుధాలతో తమను తాము గాయపరుచుకున్నారు. జైలు సిబ్బంది వారిని చూసి కాపాడారు. ఐదుగురిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఘటనలో ఓ ఖైదీ ఫోన్​ను మింగేశాడు.

Tihar jail prisoners: దిల్లీలోని తిహాడ్ జైలులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జైలు నంబర్ 3లోని ఒకటో నంబర్​ వార్డులో ఉన్న ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. పుదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరుచుకున్నారు. జైలు సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించడం వల్ల వీరెవరూ ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డ ఐదుగురిని హుటాహుటిన జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఓ ఖైదీని మాత్రం దీన్​దయాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే ఖైదీలు ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారో తెలియదని అధికారులు తెలిపారు. జైలు గదిలోనే వారంతా స్వయంగా గాయపరుచుకున్నారని చెప్పారు. ఓ ఖైదీ ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా.. ఇతర ఖైదీల కేకలు విని అక్కడకు వెళ్లినట్లు వివరించారు. ఆస్పత్రిలో ఉన్న ఖైదీలు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. జనవరి 3న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఫోన్ మింగిన ఖైదీ..

తిహాడ్ జైల్లోనే బుధవారం మరో విచిత్ర ఘటన జరిగింది. ఓ ఖైదీ మొబైల్ ఫోన్​ను మింగేసినట్లు సిబ్బంది తెలిపారు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షిస్తున్నారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, మొబైల్​ ఇంకా అతని కడుపులోనే ఉందని పోలీసులు చెప్పారు. ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీయాల్సి ఉందన్నారు.

జైలులో ఖైదీలు ఎవరైనా ఫోన్​ వినియోగిస్తున్నారా? అని తనిఖీలు నిర్వహిస్తుండగా.. సిబ్బందిని చూసి అతడు మొబైల్​ను మింగేసినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ పరిమాణం చిన్నదే అని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: దేశంలో కరోనా విలయ తాండవం .. ఒక్కరోజే 90,928 కేసులు

Last Updated :Jan 6, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.