ETV Bharat / bharat

మహిళపై వలస కూలీల గ్యాంగ్ రేప్.. 9నెలల పాపను చంపి ఆపై గృహిణి ఆత్మహత్య

author img

By

Published : May 25, 2022, 5:02 PM IST

Updated : May 25, 2022, 9:21 PM IST

Crime News
Crime News

Crime News: ఓ మహిళపై ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఆ వలస కార్మికులను అరెస్టు చేశారు. గుజారాత్​లో జరిగిన మరో ఘటనలో.. కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన 9నెలల కుమార్తెను చంపి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. వీటితో పాటు దేశంలో జరిగిన పలు నేరాలకు సంబంధించిన నిందితులను పోలీసుల అరెస్ట్​ చేశారు.

FisherWoman Rape: తమిళనాడు రామేశ్వరంలో దారుణం జరిగింది. ఓ 45 ఏళ్ల మహిళపై ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమెను చంపి, మృతదేహాన్ని తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రామేశ్వరంలోని వడకాడు మత్స్యకార గ్రామంలో మంగళవారం ఉదయం చేపల కోసం బాధితురాలు వెళ్లింది. చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గ్రామంలో ఉన్న రొయ్యల ఫామ్‌లో ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయి పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి పరిశీలించారు. అది బాధితురాలి మృతదేహం అని తేల్చారు. ఆ సమయంలోనే బాధితురాలి హత్యాచారంలో ఆరుగురు వలస కార్మికుల ప్రమేయం ఉందని తెలుసుకున్న గ్రామస్థులు వారిని చితక్కొట్టారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రామేశ్వరం జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

కుటుంబ కలహాల కారణంగా గృహిణి ఆత్మహత్య.. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన తొమ్మిది నెలల కుమార్తెను చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని నవగామ్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. "ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్న బాధిత మహిళ.. విడిగా జీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతుండేది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది" అని పోలీసులు తెలిపారు

భర్తను హత్య చేయించిన భార్య అరెస్ట్​.. వేరే వ్యక్తి సాయంతో భర్తను హత్య చేయించిన భార్యను అరెస్టు చేశారు పోలీసులు. హత్య జరిగాక కేసును తప్పుదారి పట్టించడానికి నిందితుడితో పాటు మృతుడి భార్య ప్రయత్నంచిందని పోలీసులు చెప్పారు. దిల్లీలోని రన్​హోలా ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితుడు, ఆమె భార్యతో తరచూ గొడవపడతుండేవాడు. అయితే బాధితుడికి ఇద్దరు భార్యలు ఉండడం గొడవలకు కారణమని తెలుస్తోంది. ఇక, బాధితుడి భార్య..ఆ గొడవలు తాళలేక భర్తను చంపించాలని కుట్ర పన్నింది. పథకం ప్రకారం మే 18న మహిళ.. తన భర్త నిద్రిస్తున్న సమయంలో నిందితుడు కాలా జుమ్మన్‌ని పిలిచి హత్య చేయించింది. ఇది దోపిడీగా చూపించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తన నివాసానికి సమీపంలో రోడ్డుపై తన భర్త మృతదేహం పడి ఉందని పోలీసులకు తానే కాల్​ చేసి చెప్పింది. ఇక పోలీసుల తమదైన శైలిలో విచారణ చేపట్టడం వల్ల అసలు విషయం బయటపడింది.

16 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఓ 16 ఏళ్ల బాలికపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అతడి భార్య కూడా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు. "సుర్గుజా జిల్లాలోని మణిపుర్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని పొలంలో సోమవారం మధ్యాహ్నం బాలిక మృతదేహం లభ్యమైంది. శవపరీక్షలో ఆమెపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు తేలింది. నిందితులైన దంపతులుతో పాటు బాధితురాలు ఒకే చోట కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి దంపతులు పనికి వెళ్లలేదని తెలుసుకున్నాం" అని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ కాల్ రికార్డుల ద్వారా నిందితులను గుర్తించామని పోలీసులు చెప్పారు.

మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ కిరాతకుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామంలో ఆడుకుంటున్న మైనర్​ బాలికను పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగొట్టాడు నిందితుడు. బాలిక కేకలు విన్న గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి నిందితుడు పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు. బాలికను ఆసుపత్రిలో చేర్చామని, అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు చెప్పారు. .

పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మహిళ ఆత్మహత్య.. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఎలుకల మందు తాగిన ఓ 19 ఏళ్ల యువతి బుధవారం మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్​లోని ఛప్రౌలి గ్రామానికి చెందిన ఒక మహిళతో బాధితురాలి సోదరుడు పారిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అతడికోసం పోలీసులు వెతుకుతున్నా.. దొరకడం లేదు. ఇక, సోదరుడి ఆచూకీ లభించకపోతే తాము జైలుకెళతామనే భయంతో మృతురాలి కుటుంబసభ్యులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిస్థితి విషమించి బాధితురాలు మరణించింది.

ఇవీ చదవండి: మరో పరువు హత్య.. 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్​'.. ఆడియో వైరల్

ఐదేళ్ల బాలికపై రేప్.. రూ.70 లక్షలు ఎగ్గొట్టి మహిళపై అత్యాచారం

Last Updated :May 25, 2022, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.