ETV Bharat / bharat

భారత్​కు 'ఈటా' వైరస్- దుబాయ్​ నుంచి వచ్చిన వ్యక్తిలో...

author img

By

Published : Aug 6, 2021, 1:39 PM IST

కొవిడ్​ వైరస్​ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ.. విస్తరిస్తోంది. బ్రిటన్​లో తొలిసారి గుర్తించిన 'ఈటా వేరియంట్​' భారత్​కు పాకింది. మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

Eta variant
ఈటా వేరియంట్​

కరోనా మహమ్మారి రూపం మారుస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. తొలిసారి బ్రిటన్​లో వెలుగు చూసిన ఈటా వేరియంట్​ను కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తిలో గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్​ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్​గా తేలిందని, కొద్ది రోజుల తర్వాత అతను కోలుకున్నట్లు చెప్పారు. అతనితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

వైరస్​ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా.. ఆ వ్యక్తిలో కొత్త రకం బయటపడినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.