ETV Bharat / bharat

కాన్పుర్​లో 'స్పుత్నిక్​-వీ' క్లినికల్​ ట్రయల్స్​!

author img

By

Published : Nov 15, 2020, 3:53 PM IST

Updated : Nov 15, 2020, 8:33 PM IST

రష్యన్​ 'స్పుత్నిక్​-వీ' రెండు, మూడు దశల క్లినికల్​ ట్రయల్స్​ ఉత్తర్​ప్రదేశ్​​లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు​ కరోనా వ్యాక్సిన్ తొలిబ్యాచ్​..​ వచ్చే వారం కాన్పుర్​లోని ఓ మెడికల్​ కాలేజీకి రానున్నట్టు తెలుస్తోంది.

First batch of Sputnik V vaccine to arrive in Kanpur medical college
కాన్పుర్​లో 'స్పుత్నిక్​-వీ' 2, 3  దశల క్లినికల్​ ట్రయల్స్​!

రష్యా తొలి కరోనా వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​-వీ'కి చెందిన తొలి బ్యాచ్​.. వచ్చేవారం ఉత్తర్​ప్రదేశ్​కు చేరుకునే అవకాశముంది. ఈ మేరకు రెండు, మూడు దశల క్లినికల్​ ట్రయల్స్​ను కాన్పుర్​లోని గణేశ్​ శంకర్ విద్యార్థి​ మెడికల్​ కాలేజీలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్​ ప్రయోగాలకు సంబంధించి డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబొరేటరీస్​కి​.. భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) నుంచి అనుమతులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు వచ్చే వారం నుంచే స్పుత్నిక్​-వీ క్లినికల్​ ట్రయల్స్​ చేపట్టనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్​ ఆర్​బీ కమల్​ వెల్లడించారు. ఇందుకోసం సుమారు 180 మంది వలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.

7నెలల సుదీర్ఘ పర్యవేక్షణ

వలంటీర్లకు ఎంత మోతాదు వ్యాక్సిన్​ ఇవ్వాలనేది పరిశోధన విభాగం అధిపతి సౌరభ్​ అగర్వాల్​ నిర్ణయిస్తారని కమల్​ తెలిపారు. టీకా తీసుకున్న అనంతరం.. వలంటీర్లను నిరంతరంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. 21రోజుల వ్యవధిలో ఇచ్చే రెండు, మూడు డోసుల పనితీరును ఏడు నెలల పాటు అధ్యయనం చేస్తామని వివరించారు.

రెడ్డీస్​ ల్యాబ్​కు కోటి డోస్​లు

ఈ ఏడాది సెప్టెంబర్​లో డాక్టర్​ రెడ్డీస్​, రష్యన్​ డైరెక్ట్​​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​(ఆర్డీఐఎఫ్​), రష్యన్​ సావరీన్​​ వెల్త్​ ఫండ్​లు.. భారత్​లో స్పుత్నిక్​-వీ వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహణ, పంపిణీ చేపట్టేందుకు భాగస్వామ్యమయ్యాయి. ఈ ఒప్పందంలో భాగంగా డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్​కు పది కోట్ల మోతాదుల వ్యాక్సిన్​ సరఫరా చేయనుంది ఆర్డీఐఎఫ్​.

ఇదీ చదవండి: 'స్పుత్నిక్​-వీ వ్యాక్సిన్​ 92శాతం ప్రభావవంతం'

Last Updated :Nov 15, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.