ETV Bharat / bharat

కూతురు శవాన్ని భుజంపై మోస్తూ 10కి.మీ నడిచిన తండ్రి

author img

By

Published : Mar 26, 2022, 11:24 AM IST

Father daughter dead body: కూతురు శవాన్ని భుజాలపై మోస్తూ తండ్రి 10 కిలోమీటర్లు నడిచిన అమానవీయ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనకు కారకులైన అధికారులను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ఆరోగ్యమంత్రి విచారణకు ఆదేశించారు.

father-walks-carrying-daughter-body-on-shoulder-in-sarguja
కూతురు శవాన్ని భుజంపై మోస్తూ 10కి.మీ నడిచిన తండ్రి

కూతురు శవాన్ని భుజంపై మోస్తూ 10కి.మీ నడిచిన తండ్రి

Father walking with daughter body: ఛత్తీస్​గఢ్​ సర్​గుజాలో హృదయవిదారక ఘటన జరిగింది. కూతురు శవాన్ని భుజాలపై మోస్తూ రోడ్డుపై 10కిలోమీటర్లు నడిచాడు ఓ తండ్రి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమామల్లో వైరల్​గా మారింది. దీంతో రాష్ట్ర ఆరోగ్యమంత్రి టీఎస్​ సింగ్​ డియో విచారణకు ఆదేశించారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఏడేళ్ల బాలిక పేరు సురేఖ. ఆమె తండ్రిపేరు ఈశ్వర్ దాస్. అమ్​దాలా గ్రామ నివాసులు. బాలిక ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆమెను లఖాన్​పుర్ గ్రామం ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బాలిక మరణించింది. అయితే మృతదేహాన్ని తరలించేందుకు వాహనం రావడానికి ముందే తండ్రి శవాన్ని మోసుకుంటూ వెళ్లిపోయాడని అధికారులు పేర్కొన్నారు.

father-walks-carrying-daughter-body
కూతురు శవాన్ని భుజంపై మోస్తూ 10కి.మీ నడిచిన తండ్రి

Sarguja News: బాలికను శుక్రవారం ఉదయం ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు 60 మాత్రమే ఉన్నాయని వైద్యులు చెప్పారు. ఆమె ఐదు రోజుల ముందు నుంచే జ్వరంతో బాధపడినట్లు పేర్కొన్నారు. చికిత్స అందించినప్పటికీ బాలిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో మరణించిందని ఆర్​ఎంఏ డా.వినోద్ భార్గవ్ వివరించారు. వాహనం వస్తుందని తండ్రికి చెప్పామని, కానీ అది రాకముందే అతను శవాన్ని తీసుకుని వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత 9:20 గంటలు వాహనం వచ్చిందని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడం వల్ల అది ఆరోగ్యమంత్రి టీఎస్​ సింగ్ దృష్టికి వచ్చింది. ఆందోళన చెందిన ఆయన.. విచారణ చేపట్టాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఉద్యోగులపై వేటు వేయాలని సూచించారు. విధుల్లోని ఆరోగ్య సిబ్బంది బాధిత కుటుంబం వాహనం వచ్చేంతవరకు వేచి చూడేలా చేయాల్సిందని, ఇలా జరగకుండా చూసుకోవాల్సిందని అన్నారు.

ఇదీ చదవండి: సిగరెట్ తాగాడని.. గొంతు కోసి.. మృతదేహాన్ని బ్యాగులో కుక్కి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.