ETV Bharat / bharat

దీపావళి స్పెషల్ స్వీట్​ కిలో రూ.25వేలు.. ఎందుకంత ధర?

author img

By

Published : Nov 2, 2021, 3:37 PM IST

diwali sweets
గోల్డెన్​ పిస్తాచియో బాల్​, గోల్డెన్​ పిస్తాచియో డెసర్ట్​

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఓ మిఠాయి దుకాణం.. కేజీ రూ. 25వేలు విలువ చేసే స్వీట్లు అమ్ముతోంది. ఈ గోల్డెన్​ పిస్తాచియో బాల్​, గోల్డెన్​ పిస్తాచియో డెసర్ట్​కు భారీ డిమాండ్​ లభిస్తోంది. అసలు ఈ స్వీట్ల ప్రత్యేక ఏంటి? అంత ధర ఎందుకు?

దీపావళి అంటే.. టపాసులతో పాటు స్వీట్లు కూడా కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే మిఠాయి దుకాణాలు దీపావళి సమయంలో కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు దుకాణదారులు కూడా వివిధ రకాల స్వీట్లను తయారు చేస్తూ ఉంటారు. గుజరాత్​ అహ్మదాబాద్​లోని ఓ మిఠాయి దుకాణంలో.. దీపావళికి ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్లకు భారీ డిమాండ్​ లభిస్తోంది. ఇప్పటికే 10లక్షల స్వీట్లు అమ్ముడుపోయాయి. ఈ స్వీట్ల ధర కేజీకి రూ. 25వేలుగా ఉండటం విశేషం.

వీటి ప్రత్యేకతేంటి?

గోల్డెన్​ పిస్తాచియో బాల్​, గోల్డెన్​ పిస్తాచియో డెసర్ట్​పై 24క్యారెట్ల బంగారం పూత ఉంటుంది. వీటిలో అత్యంత ఖరీదైన నౌజా డ్రైఫ్రూట్​తో పాటు మామ్రా ఆల్మండ్​ను వినియోగిస్తారు. ఈ నౌజా.. ఇరాన్​, ఇరాక్​, అఫ్గానిస్థాన్​ నుంచి దిగుబడి అవుతుంది. ఒక్క కేజీ నౌజా.. దాదాపు రూ. 6వేలు ఉంటుంది. వీటిని తయారు చేసేందుకు టర్కీ నుంచి చెఫ్​లను పిలిపించారు. అందుకే ఈ స్వీట్ల ధర కిలో రూ. 25వేలు. పైగా ఈ స్వీట్లు రెండు నెలల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ వివరాలను షాపు యజమాని జై శర్మ వెల్లడించారు.

diwali sweets
గోల్డెన్​ పిస్తాచియో బాల్​, గోల్డెన్​ పిస్తాచియో డెసర్ట్​
diwali sweets
కేజీ రూ. 25వేలు
diwali sweets
24క్యారెట్ల బంగారం పూతతో తయారి

ధర ఎంత ఉన్నా.. మార్కెట్​లో మాత్రం ఈ స్వీట్లకు భారీ డిమాండ్​ ఉంటోంది. ఇప్పటికే 10లక్షలకుపైగా స్వీట్లు అమ్ముడుపోయాయి. వ్యాపారులు, రాజకీయ నేతలే వీటిని ఎక్కువగా కొంటున్నట్టు తెలుస్తోంది.

diwali sweets
ఖరీదైన డ్రై ఫ్రూట్స్​ వినియోగం
diwali sweets
గోల్డెన్​ పిస్తాచియో బాల్​, గోల్డెన్​ పిస్తాచియో డెసర్ట్​
diwali sweets
గోల్డెన్​ పిస్తాచియో బాల్​, గోల్డెన్​ పిస్తాచియో డెసర్ట్​

మహారాష్ట్రలో..

దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ స్వీటు షాపు.. సరికొత్త మిఠాయిను తయారుచేసింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో చేసిన స్వీటును 'సువర్ణ కలష్​' పేరుతో మార్కెట్​లో విక్రయిస్తోంది. దీని ధర కూడా ఎక్కువే. కేజీ స్వీటు ధర రూ.11,000.

మొత్తం 12 కేజీల స్వీటును తయారు చేసినట్లు రఘువీర్ మిఠాయి షాపు నిర్వాహకుడు తేజస్ పోపత్ తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్​ నుంచి నిపుణుల్ని రప్పించినట్లు వివరించారు. సోమవారం నాటికి 6-7కేజీల స్వీట్స్​ను విక్రయించామన్నారు. కొవిడ్-19 కారణంగా గతేడాది ఈ ప్రత్యేక స్వీట్​ను తయారు చేయలేదని చెప్పారు రఘువీర్.

ఇదీ చూడండి:- 'మిరపకాయ్​ మిఠాయ్​' రుచి​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.