ETV Bharat / bharat

Afghan news: 'అఫ్గాన్​ నుంచి 300 మంది భారతీయుల తరలింపు'

author img

By

Published : Aug 22, 2021, 3:53 AM IST

Updated : Aug 22, 2021, 6:31 AM IST

అఫ్గానిస్థాన్​లో(Afghanistan news) చిక్కుకున్నవారిలో దాదాపు 300 మంది సురక్షితంగా ఆదివారం భారత్​కు చేరుకోనున్నారు. ఈ మేరకు 87 మందితో ఓ ఎయిర్​క్రాఫ్ట్ స్వదేశానికి​ బయలుదేరినట్లు విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. మరో 135 మందిని దోహా నుంచి భారత్​కు తరలించినట్లు(Indian evacuation from Afghanistan) భారత దౌత్యకార్యాలయం పేర్కొంది.

afghan, indians
భారతీయులు, అఫ్గానిస్థాన్

తాలిబన్ల(Taliban) వశమైన అఫ్గానిస్థాన్(Afghanistan news)​ రాజధాని కాబుల్‌లో.. రోజురోజుకీ భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 300 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు(Indian evacuation from Afghanistan) అధికారులు ఏర్పాట్లు చేశారు. భారత వైమానిక దళానికి చెందిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 87 మంది భారతీయులను ఇవాళ దిల్లీకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఎయిర్​క్రాఫ్ట్ ఇండియాకు బయలుదేరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.

indians, bagchi
స్వదేశానికి సురక్షితంగా తరలించి
indians, bagchi
87 మందితో బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్

"అఫ్గాన్​ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకువస్తున్నాం. ఏఐ 1956 విమానం 87 మంది భారతీయులతో తజకిస్థాన్ నుంచి బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీలు కూడా ఉన్నారు. మరింత మందిని భారత్​కు సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం."

--అరిందమ్ బాగ్చి, విదేశాంగ అధికార ప్రతినిధి.

మరోవైపు కాబుల్ నుంచి దోహాకు తరలించిన 135 మంది భారతీయులను.. స్వదేశానికి తీసుకువస్తున్నట్లు కతార్​లోని భారత దౌత్యకార్యాలయం ప్రకటన చేయడం గమనార్హం. యూఎస్, నాటో దళాల సాయంతో వీరిని దోహాకు తరలించినట్లు భారత అధికారులు పేర్కొన్నారు.

indians, afghan crisis
దోహా నుంచి భారత్​కు బయలుదేరిన పౌరులు

అప్గాన్ రాజధాని నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి సారించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అప్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య.. 400 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు ఇతర దేశాల సమన్వయంతో వారిని స్వదేశానికి తీసుకురావడానికి భారత్ మార్గాలను అన్వేషిస్తోంది.

  • #WATCH | Evacuated Indians from Kabul, Afghanistan in a flight chant 'Bharat Mata Ki Jai' on board

    "Jubilant evacuees on their journey home,"tweets MEA Spox

    Flight carrying 87 Indians & 2 Nepalese nationals departed for Delhi from Tajikistan after they were evacuated from Kabul pic.twitter.com/C3odcCau5D

    — ANI (@ANI) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నినాదాల హోరు..

తజకిస్థాన్​ నుంచి భారత్​కు బయలుదేరిన ఎయిర్​క్రాఫ్ట్​లో 'భారత్​ మతాకీ జై' అంటూ నినాదాలు చేశారు స్వదేశీ పౌరులు. ఈ వీడియోను విదేశాంగ శాఖ షేర్ చేసింది.

ఇదీ చదవండి:Afghan news: తాలిబన్లు కిడ్నాప్ చేసిన భారతీయులు సేఫ్​!

Last Updated :Aug 22, 2021, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.