ETV Bharat / bharat

ట్రక్​పై డౌట్.. చెక్ చేసిన జవాన్లపై కాల్పులు.. గంట తర్వాత నలుగురు  ఉగ్రవాదులు హతం

author img

By

Published : Dec 28, 2022, 9:59 AM IST

Updated : Dec 28, 2022, 11:34 AM IST

జమ్ములోని సిధ్రా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ముష్కరులు మరణించారు.

Encounter in Jammu
Encounter in Jammu

జమ్ముకశ్మీర్​లో బుధవారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు మరణించారు. సిధ్రాలో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ ట్రక్కును నిలపగా బలగాలపైకి ముష్కరులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పుల జరిపారు. దట్టమైన మంచులో దాదాపు గంట పాటు ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగింది. ఈ కాల్పుల్లో ట్రక్కు మంటల్లో కాలిపోయిందని ఏడీజీపీ తెలిపారు. వారి వద్ద నుంచి 7 ఏకే 47 తుపాకులు, 3 పిస్టోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతానికి నలుగురు మరణించారని.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. వారి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Encounter in Jammu
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక వాహనం

"కశ్మీర్​ వైపు వెళ్తున్న ఓ ట్రక్కుపై అనుమానం వచ్చి ఆపాము. వెంటనే డ్రైవర్​ దిగి మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలోనే తనిఖీ చేసేందుకు ట్రక్కు వద్దకు వెళ్లగా లోపల నుంచి కాల్పులు చేశారు. ఎదురు కాల్పులు చేయగా ముగ్గురు మరణించారు. పారిపోయిన డ్రైవర్​ కోసం గాలింపు చర్యలు చేపట్టాం."

- ముఖేశ్​ సింగ్​, ఏడీజీపీ జమ్ము

మరోవైపు ఉగ్రవాదులకు సహాయం అందిస్తున్న తయాబ్ ఖాన్ అనే వ్యక్తిని ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద ఓ పిస్టల్ తో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న షోపియాన్‌లోని హీర్‌పోరా ప్రాంతంలో నివసించే వసీమ్ అహ్మద్ వనీ అనే పౌరుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

Encounter in Jammu
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక వాహనం
Encounter in Jammu
ఎన్​కౌంటర్​ స్థలంలో బలగాలు

ఇవీ చదవండి: అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

కార్మికుడి ఛాతిలోకి దిగిన ఐరన్​ రాడ్​.. నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి దూసుకొచ్చి..

Last Updated : Dec 28, 2022, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.