ETV Bharat / bharat

సుదీర్ఘ యాత్రకు ముగింపు- సొంత గూటికి చైనా ఏనుగులు!

author img

By

Published : Aug 9, 2021, 12:50 PM IST

china ELEPHANTS
చైనా ఏనుగులు

చైనాలో సంచరిస్తున్న ఏనుగులు ఎట్టకేలకు తమ ఆవాసానికి చేరుకున్నాయి. కొన్ని నెలల పాటు ప్రయాణం చేసిన సంచార ఏనుగులు చైనా నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌కు వచ్చేశాయి. ప్రస్తుతం గజరాజుల గుంపు.. వాటికి అనువైన ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

చైనాలోని రిజర్వు అటవీ ప్రాంతం నుంచి గతేడాది బయటకు వచ్చిన ఏనుగుల గుంపు.. ఎట్టకేలకు తిరిగి తమ ఆవాసానికి చేరుకున్నాయి. 14 ఆసియా ఏనుగుల మంద నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్​కు తిరిగి వచ్చాయి.

china ELEPHANTS
ఏనుగుల గుంపు

కొన్ని నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణం చేసిన సంచార ఏనుగులు.. గత ఐదు రోజులుగా యుగ్జీ నగరం సమీపంలో తిరిగాయి. స్థానిక అధికారులు డ్రోన్ల సాయంతో వాటి కదలికలను పర్యవేక్షించారు. ట్రక్కులు అడ్డుపెట్టి ఏనుగులు తమ ఆవాసానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. యువాంగ్జియాంగ్ నది దాటేలా చర్యలు తీసుకున్నారు గురువారం యుగ్జీ నగరం నుంచి ఏనుగుల మంద అడవుల్లోకి తమ ప్రయాణం కొనసాగించింది. అయితే వాస్తవ ఆవాసానికి పూర్తిగా చేరుకోనప్పటికీ.. ఏనుగులు ప్రస్తుతం వాటికి అనువైన ప్రదేశంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.

china ELEPHANTS
.

వందల కి.మీ ప్రయాణం

గతేడాది ఏనుగుల గుంపు జిషింగ్‌బన్న దాయ్‌ ప్రాంతంలోని అడవుల నుంచి 500 కి.మీ మేర ప్రయాణించి జూన్‌ 2న కున్మేందుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అవి రద్దీ జనావాసాల్లోకి రాకుండా చైనా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

china ELEPHANTS
వంతెన దాటుతున్న ఏనుగులు

ఇదీ చదవండి: ఆ ఏనుగులు ఇప్పుడు అంతర్జాతీయ సెలబ్రిటీలు!

గతేడాది యువాన్‌ ఫ్రావిన్స్‌లోని రిజర్వ్ నుంచి బయటకువచ్చిన 16 అడవి ఏనుగులు 500 కిలోమీటర్లు పయనించాయి. మొత్తంగా 16 గజరాజులు రిజర్వ్ నుంచి బయటకు రాగా.. వాటిలో రెండు ఇదివరకే తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి.

ఇదీ చదవండి: ఏనుగుల దండయాత్ర- 11 లక్షల డాలర్ల నష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.