ETV Bharat / bharat

పాత్రికేయులకు ఇక పోస్టల్​ బ్యాలెట్.. ఆ ఉద్యోగులకు కూడా...

author img

By

Published : Jan 17, 2022, 3:43 PM IST

Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా పాత్రికేయులు తమ ఓటును వినియోగించుకునేందుకు అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ). వారితో పాటు ఎన్నికల జరిగిన రోజు అత్యసవర సేవలు అందించే సిబ్బందికి ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ.

Elections 2022
Elections 2022

Postal Ballot in Elections 2022: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పోస్టల్​ బ్యాలెట్​పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ ద్వారా గుర్తింపు పొందిన పాత్రికేయులు పోస్టల్​ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించింది.​ అంతకుముందు.. 80 ఏళ్లు పైబడివారు, దివ్యాంగులు(40శాతం కంటే ఎక్కువ),కరోనా సోకినవారు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయడానికి ఈసీ ఆమోదం తెలపింది. ఈ జాబితాకు అదనంగా పాత్రికేయులను చేర్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు ఈసీ.

విద్యుత్​, బీఎస్ఎన్​ఎల్​, రైల్వే, పోస్టు, టెలిగ్రామ్​, దూరదర్శన్​, ఆల్​ ఇండియా రేడియో, వైద్య సిబ్బంది, విమానయానం, ఆహార, పౌర సరఫరా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్​, ఈసీ ద్వారా గుర్తింపు పొంది.. ఎన్నికల రోజు వార్తలు కవరేజీ చేసే మీడియా వ్యక్తులకు ఈ సదావకాశాన్ని వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో పాటుగా ఎన్నికల తేదీల్లో విధులు నిర్వహించే ఇతర అత్యవసర విభాగాల సిబ్బందికి ఈ సదుపాయం కల్పించింది.

ఇదీ చూడండి: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా- కొత్త తేదీ ఇదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.