ETV Bharat / bharat

టీ ఇచ్చి టిఫిన్​ పెట్టలేదని.. కోడలిపై కాల్పులు

author img

By

Published : Apr 15, 2022, 11:51 AM IST

Man Shoots Daughter in Law: మహారాష్ట్రలోని ఠాణెలో దారుణం జరిగింది. టిఫిన్​ పెట్టలేదన్న కారణంతో కోడలిపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Man Shoots Daughter in Law

Man Shoots Daughter in Law: టిఫిన్​ పెట్టలేదన్న కారణంతో కోడలిపై కాల్పులకు దిగాడు ఓ వృద్ధుడు. మహారాష్ట్రలోని ఠాణెలో గురువారం ఉదయం సుమారు 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. నిందితుడిని కాశీనాథ్​ పాండురంగ్​ పాటిల్​గా (76) పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడి మరో కోడలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాల్పులకు పాల్పడిన పాటిల్​ను అరెస్ట్​ చేయాల్సి ఉంది. ఈ ఘటన వెనుక మరే కారణమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. టీతో పాటు కోడలు తనకు బ్రేక్​ఫాస్ట్​ పెట్టలేదనే కోపంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : రూ.15వేల కోసం బాలికను చంపిన యువకుడు.. ఆపై ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.