కుటుంబ సభ్యులకు వృద్ధుడి షాక్​.. రూ.2 కోట్ల ఆస్తి మొత్తం..

author img

By

Published : Nov 27, 2021, 7:00 PM IST

old man will to collector

సొంత కుటుంబ సభ్యులే ఆ వృద్ధుడిని ఇంట్లో నుంచి తరిమేశారు. పట్టించుకునే వాళ్లు కరవై ఆ పెద్దాయన ఎక్కడెక్కడో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన పేరు మీద ఉన్న రూ.2 కోట్ల ఆస్తిని.. తన కుటుంబానికి దక్కకూడదని భావించాడు ఆ వృద్ధుడు. దాంతో ఆ ఆస్తి మొత్తాన్ని జిల్లా కలెక్టర్(Old man donates property to dm) పేరు మీద వీలునామా రాశాడు.

కలెక్టర్​ కార్యాలయం.. మధ్యాహ్న సమయం.. సరిగ్గా అప్పుడే ఓ వృద్ధుడు అక్కడికి చేరుకున్నాడు. నేరుగా కలెక్టర్​​​ ఉండే గది​లోకి వెళ్లాడు. అందరిలాగే తనకున్న సమస్యలేవో పరిష్కరించాలని కోరేందుకు వచ్చాడేమో అనుకున్నారు అక్కడి సిబ్బంది. కానీ, ఆయన తన రూ.2 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను బయటకు తీసి, 'ఈ ఆస్తి మీదే' అంటూ కలెక్టర్​కు అందించడం చూసి.. ఆశ్చర్యపోవడం అక్కడున్న వాళ్ల వంతైంది. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ సంఘటన జరిగింది.

old man will to collector
గణేశ్ శంకర్ పాండే

అసలేం జరిగింది?

ఆగ్రాలోని(Up agra news) నీరాలబాద్ పీపల్ మండి ప్రాంతానికి చెందిన 88 ఏళ్ల గణేశ్ శంకర్ పాండే... తన ఆస్తిని కలెక్టర్​ పేరు మీద రాశారు. తన సోదరులు నరేశ్ శంకర్​ పాండే, రఘునాథ్ శంర్ పాండే, అజయ్ శంకర్​ పాండేతో కలిసి గణేశ్​ శంకర్​ పాండే.. 1983 మార్చి 30న 1000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత తన సోదరులు విడిపోయారు. ఆ భూమిలో తన వాటాగా దక్కిన భూమిని 2018 ఆగస్టు 4న ఆగ్రా కలెక్టర్​ పేరు మీద వీలునామా(Old man will to dm) రాశారు గణేశ్​ శంకర్ పాండే. ఇందుకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను గణేశ్​ శంకర్​.. కలెక్టర్​కు అప్పగించేందుకు గురువారం వచ్చారు. ఈ భూమి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.

old man will to collector
కలెక్టర్​

ఇంటి నుంచి తరిమేయగా..

తన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తరిమేశారని గణేశ్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం తన సోదరులు రఘునాథ్​, అజయ్​ల వద్ద తాను ఉంటున్నానని చెప్పారు. తన ఇద్దరు కుమారులు తనను పట్టించుకోకుండా వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ఆస్తిని.. కలెక్టర్​ పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. తన కుటుంబం గురించి చెబుతూ గణేశ్​.. కన్నీటి పర్యంతం అయ్యారు.

old man will to collector
ఆస్తి పత్రాలు

ఇదీ చూడండి: వృద్ధురాలి ఔదార్యం.. రిక్షా కార్మికుడికి రూ.కోటి ఆస్తి దానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.