ETV Bharat / bharat

శరద్ పవార్ మనవడి కంపెనీల్లో ఈడీ సోదాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 3:45 PM IST

Updated : Jan 5, 2024, 4:07 PM IST

ED Raid On Rohit Pawar
ED Raid On Rohit Pawar

ED Raid On Rohit Pawar Company : ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుటుంబానికి చెందిన సంస్థలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. పవార్‌ మనవడు రోహిత్ పవార్‌కు చెందిన బారామతి ఆగ్రో, అనుబంధ సంస్థల్లో తనిఖీలు జరిగాయి. మరోవైపు, దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందులు, వాటిని మొహల్లా క్లీనిక్‌లకు కూడా సరఫరా చేశారా? అనే అంశంపై CBI విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది.

ED Raid On Rohit Pawar Company : మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ మనవడు రోహిత్ పవార్​కు చెందిన బారామతి ఆగ్రో, అనుబంధ సంస్థలో శుక్రవారం ఈడీ దాడులు జరిపింది. బారామతి, పుణె, ఔరంగాబాద్‌, అమరావతితో సహా దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.

అసలేం జరిగిందంటే?
మహారాష్ట్ర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టర్ కొనుగోలు వేలంలో అవకతవకలు జరిగాయని బారామతి ఆగ్రో కంపెనీపై ముంబయి పోలీసులు 2019 ఆగస్ట్​లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. బారామతి అగ్రో కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది.

నాసిరకం మందులపై సీబీఐ విచారణ
దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందులు, వాటిని మొహల్లా క్లీనిక్‌లకు కూడా సరఫరా చేశారా? అనే అంశంపై CBI విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. గతేడాది దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేయటం వల్ల ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయిన మందులను దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేశారని, అవి ప్రాణాలకే ప్రమాదమని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సరఫరాపై విచారణ జరిపించాలని దిల్లీ విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ కేంద్రానికి లేఖ రాసింది. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీ సేకరించిన ఆ మందులను మొహల్లా క్లీనిక్‌లకు కూడా సరఫరా చేశారా లేదో తేల్చాలని కోరింది.

స్వాగతించిన ఆప్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందుల సరఫరాపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 'నేను గతేడాది మార్చిలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాను. కానీ ఆరోగ్య కార్యదర్శి నా ఆదేశాలను పాటించలేదు. నాసిరకం మందుల సరఫరాపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాను.' అని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

ఈడీ బృందంపై దాడి- కారు అద్దాలు ధ్వంసం- సోదాల సమయంలో ఘటన

ఇనుము లేకుండానే రామమందిర నిర్మాణం- 21 అడుగుల గ్రానైట్ పునాది- 'అయోధ్య అద్భుతాలు' ఇవే

Last Updated :Jan 5, 2024, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.